ఇండియా- పాకిస్తాన్ మధ్య ‘గాంధీ- జిన్నా’ ట్రోఫీ.. పీసీబీ చీఫ్ జాకా ఆష్రఫ్ ప్రతిపాదన...
ఇండియా, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దు అయ్యి 10 ఏళ్లు దాటింది. చివరిగా 2012-13 సీజన్‌లో ఇండియాలో పర్యటించింది పాకిస్తాన్. ఆ తర్వాత అప్పుడప్పుడూ ఆసియా కప్ టోర్నీల్లో, ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలబడుతున్నాయి ఇండియా - పాకిస్తాన్..
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పేరుతో నాలుగేళ్ల నుంచి టెస్టు ఫార్మాట్‌లోనూ ఓ మెగా టోర్నీ నిర్వహిస్తోంది ఐసీసీ. అయితే డబ్ల్యూటీసీ సీజన్‌లోనూ ఇండియా- పాకిస్తాన్ మధ్య టెస్టులు నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయింది..
India vs Pakistan
2007లో చివరిగా ఇండియా- పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్ చూసిన అభిమానులు, మళ్లీ ఈ రెండు దేశాల మధ్య టెస్టులు చూడాలని కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండో-పాక్ మధ్య టెస్టు సిరీస్ జరగడం దాదాపు అసాధ్యమే..
షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ 2023 టోర్నీ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉంది. కానీ పాక్‌లో అడుగుపెట్టేందుకు భారత జట్టు అంగీకరించకపోవడంతో హైబ్రీడ్ మోడల్‌లో ఆసియా కప్ 2023 నిర్వహించాల్సి వచ్చింది. 2025లో పాక్‌లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వేదిక మారే అవకాశాలు ఉన్నాయి..
‘భారత్ కూడా పాకిస్తాన్‌లాగే చాలా గొప్ప క్రికెట్ దేశం. ఇండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లకు ఉండే క్రేజ్, ప్రపంచంలో ఏ మ్యాచ్‌లకీ ఉండదు. ఈ రెండు దేశాల మధ్య టెస్టు సిరీస్ జరిగితే, యాషెస్ సిరీస్ కూడా చాలా చిన్నది అయిపోతుంది..
Rohit-Kohli Test
ఇప్పటికే బీసీసీఐ ముందు గాంధీ-జిన్నా ట్రోఫీ పేరుతో ఓ సిరీస్ నిర్వహిద్దామని ప్రపోజల్ పెట్టాను. ఓ ఏడాది ఇండియాలో, మరో ఏడాది పాకిస్తాన్‌లో ఈ సిరీస్ నిర్వహించాలని కోరాను. ఈ మ్యాచులకు యాషెస్ కంటే విపరీతమైన క్రేజ్ వస్తుంది..’ అంటూ కామెంట్ చేశాడు పీసీబీ చీఫ్ జాకా ఆష్రఫ్..