MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • Pat Cummins : కమిన్స్ ఖలేజా ఉన్నోడే... అందుకే ఆరెంజ్ ఆర్మీ అల్లాడిస్తోంది

Pat Cummins : కమిన్స్ ఖలేజా ఉన్నోడే... అందుకే ఆరెంజ్ ఆర్మీ అల్లాడిస్తోంది

Indian Premier League 2025 : ప్యాట్ కమిన్స్... గత ఐపిఎల్ నుండి తెలుగు క్రికెట్ ప్రియులకు బాగా దగ్గరైన ఆటగాడు. అతడి సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అద్భుతాలు చేస్తోంది. ఆరెంజ్ ఆర్మీ అల్లాడిస్తోంది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 26 2025, 04:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Pat Cummins

Pat Cummins

ప్యాట్ కమిన్స్ :  సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో పాజిటివ్ ఎనర్జీని తీసుకువచ్చింది ప్రస్తుత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అనే చెప్పాలి. అంతకుముందు బ్యాటింగ్ బాగుంటే బౌలింగ్ వీక్ గా ... బౌలింగ్ బాగుంటే బ్యాటింగ్ లో వీక్ గా ఉండేది సన్ రైజర్స్... కానీ కమిన్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎస్ఆర్‌హెచ్ టీం సమతూకంగా కనిపిస్తోంది. ఇక కమిన్స్ కెప్టెన్ గా చాలా బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. 

గత ఐపిఎల్ సీజన్ లో కమిన్స్ కెప్టెన్సీకి వందకు వంద మార్కులు పడ్డాయి. బాల్ తోనే కాదు బ్యాట్ తోనూ అద్భుతాలు చేసే సామర్థ్యం కమిన్స్ సొంతం. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో హైదరాబాద్ టీం ను చాలాసార్లు గెలిపించాడు. ఇక కెప్టెన్ గా మైదానంలో వ్యూహాలు రచించడంలో అతడికి అతడే సాటి. అతడి వ్యూహాలే సన్ రైజర్స్ ను విజయాల బాట పట్టించింది. 

కమిన్స్ బంతితో మ్యాజిక్ చేయగలడు... ప్రత్యర్థి బ్యాట్ మెన్స్ ను బోల్తాకొట్టించి వికెట్లు పడగొట్టడంలో దిట్ట.  అతడి బంతిని చేతిలోకి తీసుకున్నాడంటే వికెట్ పడాల్సిందే. హేమాహేమీ బ్యాట్ మెన్స్ ను కూడా అద్భుతమైన బంతులతో ముప్పుతిప్పలు పెట్టగలడు సమర్ధుడు. కమిన్స్ రాకతో సన్ రైజర్స్ బౌలింగ్ విభాగం బలంగా మారింది. గతంలో టీం వీక్ నెస్ గా ఉన్న బౌలింగ్ ఇప్పుడు కమిన్స్ సారథ్యంలో బలంగా మారింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Indian Premier League 2025

Indian Premier League 2025

ఈసారి కప్ మనదేనంటున్న కాచిగూడ కమిన్స్...

కమిన్స్ ఐపిఎల్ ద్వారా తెలుగు ఫ్యాన్స్ కు దగ్గరయ్యాడు. అతడు తమ జట్టుకు అందిస్తున్న విజయాలు చూసి తెలుగోళ్లు ఉప్పొంగిపోతున్నారు. అందుకే అతడిని తమవాడిని చేసుకుంటూ 'కాచిగూడ, కర్మన్ ఘాట్, చింతల్ బస్తీ కమిన్స్' అంటూ ముద్దుపేర్లు పెట్టుకున్నారు.

కమిన్స్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ ఐపిఎల్ జట్లన్నింటి కంటే బలంగా కనిపిస్తోంది. అతడు ఆటగాడిగా ఫ్రూఫ్ చేసుకున్నాడు.... ఇక కెప్టెన్ గా మరో మెట్టు ఎక్కేసాడు. ఆస్ట్రేలియన్ కెప్టెన్సీ సన్ రైజర్స్ కు కలిసివస్తుందని కమిన్స్ మరోసారి నిరూపిస్తున్నాడు. ఈసారి కప్ మనదే అనే ధీమాతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఉండటానికి కమిన్స్ ప్రధాన కారణమని చెప్పవచ్చు.  

33
Cummins

Cummins

కమిన్స్ ఐపిఎల్ కెరీర్ : 

ఆస్ట్రేలియా క్రికెటర్లు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్లుగా బాగా రాణిస్తున్నారు. గతంలో గిల్ క్రిస్ట్, వార్నర్ లు ఈ జట్టును ముందుండి నడపగా ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఆ పని చేస్తున్నాడు. కమిన్స్ 2014 లో ఐపిఎల్ లో ఆరంగేట్రం చేసాడు... ఇప్పటివరకు అతడు 59 మ్యాచులాడి 63 వికెట్లు పడగొట్టాడు. బౌలర్ గానే కాదు బ్యాట్ మెన్ గా కూడా మంచిపరుగులే సాధించాడు. ఐపిఎల్ లో 3 హాఫ్ సెంచరీలతో 515 పరుగులు చేసాడు... హయ్యెస్ట్ వ్యక్తిగత స్కోరు 66 నాటౌట్. 

బౌలింగ్ విషయానికి వస్తే గత ఐపిఎల్ 2024 లో 16 మ్యాచులాడిన కమిన్స్ 18 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు కూడా 2020 లో  12, 2017 లొ 15 వికెట్లు తీసాడు. ఇలా ఐపిఎల్ లో ఇప్పటివరకు 63 వికెట్లు పడగొట్టాడు.  అతడి బెస్ట్ 4/34... ఐపిఎల్ 2020 లో నమోదు చేసుకున్నాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా జట్టుకు సారథ్యం వహించడమే కాదు బౌలింగ్ విభాగాన్ని కూడా   ముందుండి నడిపిస్తున్నాడు. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved