ప్యాట్ కమ్మిన్స్‌కి టీమ్‌లో ప్లేస్ కూడా వేస్ట్! అతన్ని కెప్టెన్‌గా చేయండి... ఆసీస్ మాజీ కెప్టెన్ కామెంట్
టిమ్ పైన్ నుంచి ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన ప్యాట్ కమ్మిన్స్, ఆరోన్ ఫించ్ నుంచి వన్డే కెప్టెన్సీ పగ్గాలు కూడా తీసుకున్నాడు. ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ తర్వాత డేవిడ్ వార్నర్‌కి లేదా మిచెల్ మార్ష్‌కి వన్డే కెప్టెన్సీ దక్కవచ్చని ప్రచారం జరిగినా టెస్టుల్లో సక్సెస్ అవుతున్న కమ్మిన్స్‌కే ఆ ఛాన్స్ దక్కింది...
Image credit: PTI
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆస్ట్రేలియాకి ఆశించిన ఫలితం దక్కలేదు. మొదటి మ్యాచ్‌లో టీమిండియా చేతుల్లో ఓడిన ఆస్ట్రేలియా, రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతుల్లో 134 పరుగుల తేడాతో పరాజయం పాలైంది..
రెండు మ్యాచుల్లో కెప్టెన్‌గానే కాకుండా బౌలర్‌గా కూడా ఫెయిల్ అయ్యాడు ప్యాట్ కమ్మిన్స్. మొదటి మ్యాచ్‌లో వికెట్ తీయలేకపోయిన కమ్మిన్స్, సౌతాఫ్రికాపై ఓ వికెట్ తీసినా.. 9 ఓవర్లలో 71 పరుగులు ఇచ్చేశాడు..
‘టీమ్‌లో వికెట్ కీపర్ చాలా ముఖ్యం. అలాంటి వికెట్ కీపర్ లేకుండా సౌతాఫ్రికాపై టీమ్‌ని సెలక్ట్ చేశాడు ప్యాట్ కమ్మిన్స్. నా ఉద్దేశంలో మన కెప్టెన్‌ని పక్కనబెట్టాల్సిన అవసరం ఉంది..
ఫామ్‌లో ఉన్న ప్లేయర్లు మాత్రమే కావాలి. ఫామ్‌లో లేకపోతే కెప్టెన్ అయినా సరే, రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సిందే. వరల్డ్ కప్‌కి ముందు ఏ టీమ్‌ని ఆడించాలనే విషయంపై కెప్టెన్‌కి ఓ అవగాహన ఉండాలి...
AUSTRALIA
అలెక్స్ క్యారీకి ఒకే ఒక్క మ్యాచ్ ఇచ్చారు. అలాంటప్పుడు వికెట్ కీపర్‌ని ఇండియాకి తీసుకురావడం దేనికి? కెప్టెన్ కాకపోయి ఉంటే ప్యాట్ కమ్మిన్స్ కచ్ఛితంగా టీమ్‌లో ఉండేవాడు కాదు. మీరు సరైన వ్యక్తికి కెప్టెన్సీ ఇవ్వలేదు..’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, 2015 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ మైకేల్ క్లార్క్..
‘ప్యాట్ కమ్మిన్స్ ఫామ్‌లో లేడు. వికెట్లు తీయలేకపోవడమే కాదు, భారీగా పరుగులు ఇస్తున్నాడు. అతనికి తుది జట్టులో ఉండే అర్హత కూడా లేదు. స్టీవ్ స్మిత్‌కి కెప్టెన్సీ అప్పగించి, కమ్మిన్స్‌ని కూర్చోబెట్టాలి..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..