- Home
- Sports
- Cricket
- బెంగళూరులో మా బస్సుపైన రాళ్లు వేశారు! సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ...
బెంగళూరులో మా బస్సుపైన రాళ్లు వేశారు! సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ...
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ ఆడడంపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు పీసీబీ. ఆసియా కప్ 2023 టోర్నీని హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడంతో వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలా? వద్దా? అనే విషయాన్ని తేల్చేందుకు ఓ కమిటీని నియమించనుంది..

తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ, అబ్దుల్ రజాక్ కలిసి ఈ విషయం గురించి మాట్లాడేందుకు ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో షాహిద్ ఆఫ్రిదీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..
‘ఇండియాలో మ్యాచులు ఆడడం ఎప్పుడూ తీవ్రమైన ఒత్తిడిలో పడేస్తుంది. మనం సిక్సర్లు కొట్టినా, ఫోర్లు కొట్టినా మన కోసం ఎవ్వరూ చప్పట్లు కూడా కొట్టరు. అబ్దుల్ రజాక్‌కి గుర్తుందో లేదో మేం 2005లో బెంగళూరులో టెస్టు మ్యాచ్ గెలిచినప్పుడు మా టీమ్ బస్సుపైన రాళ్లు విసిరారు..
ఇండియాలో ఆడాలంటే ప్రెషర్ ఎప్పుడూ ఉంటుంది. అయితే దాన్ని ఎంజాయ్ చేయాలి. చాలామంది ప్లేయర్లు, పాకిస్తాన్, ఇండియాకి వెళ్లకూడదని అంటున్నారు. నేనైతే దాన్ని ఒప్పుకోను..
పాకిస్తాన్ టీమ్, ఇండియాకి వెళ్లాలి. అక్కడ మ్యాచ్ గెలవాలి. సగర్వంగా స్వదేశానికి తిరిగి రావాలి... అప్పుడే కదా కిక్ ఉంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు షాహిద్ ఆఫ్రిదీ..
2005లో బెంగళూరులో జరిగిన మూడో టెస్టులో పాకిస్తాన్ 168 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. యూనిస్ ఖాన్ 267, ఇంజమామ్ వుల్ హక్ 184 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 570 పరుగుల భారీ స్కోరు చేసింది పాకిస్తాన్. బదులుగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 449 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
వీరేంద్ర సెహ్వాగ్ 201 పరుగులు చేయగా వీవీఎస్ లక్ష్మణ్ 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో 261/2 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది పాకిస్తాన్. నాలుగో ఇన్నింగ్స్‌లో టీమిండియా 214 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
గౌతమ్ గంభీర్ 52 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.. ఈ సిరీస్‌లో మొదటి టెస్టు డ్రా కాగా రెండో టెస్టులో టీమిండియా 195 పరుగుల తేడాతో గెలిచింది. మూడో టెస్టు గెలిచిన పాక్, సిరీస్‌ని డ్రా చేసింది.