- Home
- Sports
- Cricket
- పాక్ టీమ్‌ని ఇండియాకి పంపాలంటే మాక్కూడా భయంగా ఉంది... పీసీబీ ఛైర్మెన్ నజం సేథీ కామెంట్స్...
పాక్ టీమ్‌ని ఇండియాకి పంపాలంటే మాక్కూడా భయంగా ఉంది... పీసీబీ ఛైర్మెన్ నజం సేథీ కామెంట్స్...
ఆసియా కప్ 2023 టోర్నీ వేదిక విషయంలో రేగిన సందిగ్ధత ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్‌లో ఆసియా కప్ 2023 టోర్నీ జరగాల్సి ఉంది. అయితే పాక్‌లో నిర్వహిస్తే టీమిండియా అక్కడికి వెళ్లదని, తటస్థ వేదికపై టోర్నీని నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మెన్ జై షా కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి...

India vs Pakistan
ఆసియా కప్ కోసం టీమిండియా, పాకిస్తాన్‌కి రాకపోతే... పాక్ టీమ్ కూడా వన్డే వరల్డ్ కప్ 2023 కోసం ఇండియాకి వెళ్లదని అప్పటి పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యల కారణంగానే పీసీబీ ఛైర్మెన్ పదవి నుంచి తప్పించబడ్డాడు రమీజ్ రాజా...
అతని ప్లేస్‌లో పీసీబీ ఛైర్మెన్‌గా బాధ్యతలు తీసుకున్న నజం సేథీ కూడా ఈ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది. ఆసియా కప్ 2023 టోర్నీ వేదికను ఫైనల్ చేసేందుకు 2023 ఫిబ్రవరిలో బెహ్రాయిన్‌లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరిగింది..
అయితే పాక్ క్రికెట్ బోర్డు మాత్రం పాకిస్తాన్ నుంచి ఆసియా కప్ 2023 టోర్నీని తరలించేందుకు అంగీకరించడం లేదు. తాజాగా పీసీబీ ఛైర్మెన్ నజం సేథీ, దీని గురించి చేసిన కామెంట్లు, ఈ వివాదాన్ని మరింత లాగుతున్నాయి... ‘ఆసియా క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ మీటింగ్స్‌కి వెళ్లినప్పుడు వాళ్లు మాకు చాలా ఆప్షన్లు ఇచ్చారు. అవన్నీ విన్న తర్వాత మేం క్లియర్‌గా ఓ నిర్ణయం తీసుకున్నాం...
India vs Pakistan
మిగిలిన జట్లన్నీ పాకిస్తాన్‌కి వస్తున్నాయి, క్రికెట్ ఆడుతున్నాయి. వాళ్లకు ఎలాంటి సెక్యూరిటీ ఇబ్బందులు లేవు. అలాంటప్పుడు ఇండియా, పాకిస్తాన్‌కి రావడానికి భయపడడం దేనికి? అలాగే మాకు కూడా ఇండియాకి మా టీమ్‌ని పంపడానికి భయంగా ఉంది...
వాళ్లు పాక్‌కి రావడానికి ఎలాగైతే భయపడుతున్నారో, పాక్ టీమ్ కూడా ఇండియాకి వెళ్లడానికి భయపడుతోంది? అక్కడ వాళ్లకు భద్రత ఉండదని ఫీల్ అవుతోంది. ఈ విషయాలను వచ్చే మీటింగ్స్‌లో మాట్లాడబోతున్నాం.. తటస్థ వేదికపై ఆసియా కప్ నిర్వహించాలనే ఇండియా ప్రతిపాదనను మేం ఏ మాత్రం ఒప్పుకోం...
మేం సక్రమంగా ఆసియా కప్ 2023 నిర్వహణ హక్కులను సొంతం చేసుకున్నాం. అయినా ఇది ఆసియా కప్, వరల్డ్ కప్‌తో ఆగదు. 2025లో పాకిస్తాన్‌లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ఇక్కడి నుంచి తరలించాలని అంటారు. మా ప్రభుత్వం కూడా ఆసియా కప్‌ని ఇక్కడే నిర్వహించాలని అనుకుంటోంది...’ అంటూ కామెంట్ చేశాడు పీసీబీ ఛైర్మెన్ నజం సేథీ..