ఛాంపియన్స్ ట్రోఫీ: న్యూజిలాండ్ సెంచరీల మోత.. పాకిస్తాన్ కు షాక్
Champions Trophy: కరాచీలోని నేషనల్ స్టేడియంలో బుధవారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏ మ్యాచ్‌లో పాకిస్తాన్ పై న్యూజిలాండ్ ప్లేయర్లు విల్ యంగ్, టామ్ లాథమ్ లు సెంచరీలతో దుమ్మురేపారు. వీరికి తోడుగా గ్లెన్ ఫిలిప్స్ కూడా అదరగొట్టాడు.

Tom Latham-Will Young: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ మ్యాచ్‌లో కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఆతిథ్య పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ప్లేయర్లు పాకిస్తాన్ బౌలింగ్ ను దంచికొట్టారు. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ విల్ యంగ్, టామ్ లాథమ్ లు అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీలు సాధించి న్యూజిలాండ్ కు భారీ స్కోర్ అందించారు. విల్ యంగ్ 107 పరుగులు చేయగా, టామ్ లాథమ్ 118 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో పాకిస్తాన్ పై కీవీస్ జట్టు 50 ఓవర్లలో 320/5 పరుగులు చేసింది.
సెంచరీలతో అదరగొట్టిన విల్ యంగ్, టామ్ లాథమ్
పాకిస్తాన్ తో జరిగిన ఈ మ్యాచ్ లో కీవీస్ ప్లేయర్లు విల్ యంగ్, టాల్ లాథమ్ లు సెంచరీలతో దరగొట్టారు. దీంతో ఆ జట్టు భారీ స్కోర్ చేసి 60 పరుగులు తేడాతో పాక్ పై విజయం సాధించింది. విల్ యంగ్ పాకిస్థాన్‌పై 113 బంతుల్లో 107 పరుగులు (12 ఫోర్లు, ఒక సిక్స్) చేసి టోర్నమెంట్‌లో సెంచరీ చేసిన నాల్గవ కివీస్ బ్యాట్స్‌మన్ గా నిలిచాడు. ఇది విల్ యంగ్ కు వన్డేల్లో నాల్గో సంచరీ కాగా, పాకిస్థాన్‌పై మొదటిది.
118* లతో దుమ్మురేపిన టామ్ లాథమ్
విల్ యంగ్ సెంచరీ తర్వాత టామ్ లాథమ్ కూడా తన ఎనిమిదో వన్డే సెంచరీని సాధించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన టామ్ లాథమ్ 104 బంతుల్లో 10 బౌండరీలు, మూడు సిక్సర్లతో 118 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీనితో NZ 320/5 స్కోరు చేయగలిగింది. ఈ సెంచరీతో ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన ఐదో కివీస్ బ్యాట్స్‌మన్ అయ్యాడు. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్తాన్ 260 పరుగులకే ఆలౌట్ అయింది.
Babar Azam
ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీలు చేసిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్
పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విల్ యంగ్, టామ్ లాథమ్ లతో పాటు అంతకుముందు ముగ్గురు న్యూజిలాండ్ ప్లేయర్లు ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీలు సాధించారు. వారిలో ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన తొలి న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ నాథన్ ఆస్లే. 2004 టోర్నమెంట్ ఎడిషన్‌లో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్టల్ 151 బంతుల్లో 145 (13 ఫోర్లు, ఆరు సిక్సర్లు) పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆస్లే సూపర్ ఇన్నింగ్స్ తో న్యూజిలాండ్ 347/4 స్కోరు చేసింది. 210 పరుగుల తేడాతో గెలిచింది.
క్రిస్ కైర్న్స్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ కొట్టిన న్యూజిలాండ్ ప్లేయర్. 2000లో భారత్‌తో జరిగిన ఫైనల్‌లో క్రిస్ కైర్న్స్ తనదైన శైలిలో సెంచరీ సాధించి, ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ సాధించిన రెండవ కివీస్ బ్యాట్స్‌మన్ అయ్యాడు. కైర్న్స్ 113 బంతుల్లో అజేయంగా 102 పరుగులు (ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) చేయడంతో NZ 49.4 ఓవర్లలో 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అలాగే, కీవీస్ మొట్టమొదటి, ఏకైక ICC ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ కొట్టిన న్యూజిలాండ్ ప్లేయర్లలో కేన్ విలియ్సమన్ కూడా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ 97 బంతుల్లో 100 పరుగులు (ఎనిమిది బౌండరీలు, మూడు సిక్సర్లు) సాధించాడు. ఆస్ట్రేలియా తమ లక్ష్యఛేదనలో ప్రారంభంలోనే ఇబ్బంది పడింది, మూడు వికెట్లు త్వరగా కోల్పోయింది, కానీ వర్షం కారణంగా రెండు జట్లు పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది.