గిల్‌ను సచిన్‌తో పోల్చిన అక్రమ్.. స్పందించిన మరో పాక్ కెప్టెన్
WTC Final 2023: టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్‌ను పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో పోల్చాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Image credit: PTI
గడిచిన ఆరేడు నెలలుగా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా నిలకడగా రాణిస్తున్న టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్‌పై పాకిస్తాన్ దిగ్గజ బౌలర్, మాజీ సారథి వసీం అక్రమ్ ప్రశంసలు కురిపించాడు. గిల్‌ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పోల్చాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు ముందు ‘స్టార్’లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో అక్రమ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అక్రమ్ మాట్లాడుతూ.. ‘ఒకవేళ నేను టీ20 ఫార్మాట్ లో గిల్ కు గనక బౌలింగ్ చేస్తే వన్డేలలో సచిన్‌కు ఫస్ట్ 10 ఓవర్లలో ఎలా వేసేవాడినో అలాగే వేస్తా. గిల్ తప్పకుండా సచిన్ ను మరిపిస్తాడు..’ అని కామెంట్ చేశాడు.
ఈ కామెంట్స్ పై పాకిస్తాన్ మాజీ ఓపెనర్, ఆ జట్టుకు సారథిగా కూడా వ్యవహరించిన సల్మాన్ భట్ కూడా స్పందించాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా గిల్ స్పందిస్తూ.. ఇంత చిన్న వయసులోనే గిల్‌కు అక్రమ్ లాంటి దిగ్గజం ప్రశంసలు పొందడం అతడిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొదిస్తుందని తెలిపాడు.
భట్ స్పందిస్తూ.. ‘గిల్ కు బౌలింగ్ చేయడాన్ని తాను సచిన్ కు చేసినట్టే భావిస్తానని వసీం భాయ్ చెప్పాడు. నాకు తెలిసి గత కొంతకాలంగా చాలామంది గిల్ ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. పలువురు మాజీ క్రికెటర్లు గిల్ ను టెండూల్కర్ తో పోలుస్తున్నారు. అక్రమ్ చేసిన కామెంట్స్ అక్షరాలా నిజం.
అక్రమ్ లాంటి దిగ్గజ బౌలర్ గిల్ ను సచిన్ తో పోల్చడం అతడికి దక్కిన గొప్ప గౌరవం. గిల్ దీనికి అర్హుడు. కొన్ని నెలలుగా అతడు నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతానికి అతడు టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు. రాబోయే రోజుల్లో కూడా గిల్ ఇదే ఫామ్ కొనసాగించాలని కోరుకుంటున్నా..’ అని చెప్పాడు.
కాగా గతేడాది బంగ్లాదేశ్ తో టెస్టులో సెంచరీ చేసిన గిల్.. ఈ ఏడాది శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లపై సెంచరీలు బాదాడు. ఇక ఐపీఎల్ లో 17 మ్యాచ్ లు ఆడి 890 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు కూడా ఉండటం విశేషం. మూడు ఫార్మాట్లతో పాటు ఐపీఎల్ లో కూడా సెంచరీలు బాదిన గిల్.. ఇలాంటి రికార్డు అందుకున్న తొలి క్రికెటర్ గా రికార్డులకెక్కాడు.