- Home
- Sports
- Cricket
- అతను జాక్వస్ కలీస్ లాంటోడు... హార్ధిక్ పాండ్యాపై పాకిస్తాన్ మాజీ హెడ్ కోచ్ కామెంట్...
అతను జాక్వస్ కలీస్ లాంటోడు... హార్ధిక్ పాండ్యాపై పాకిస్తాన్ మాజీ హెడ్ కోచ్ కామెంట్...
ఆసియా కప్ 2018 మధ్యలో గాయపడిన హార్ధిక్ పాండ్యా కెరీర్... ఒక్కసారిగా తలకిందులైంది. వెన్ను సర్జరీ తర్వాత సరిగ్గా బౌలింగ్ చేయడానికి పాండ్యాకి నాలుగేళ్లు పట్టింది. అయితే ఎక్కడైతే ఆపాడో మళ్లీ అక్కడే మొదలెట్టినట్టుగా ఆసియా కప్ 2022 టోర్నీలో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు హార్ధిక్ పాండ్యా...

Hardik Pandya
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో హార్ధిక్ పాండ్యాకి చోటు ఇవ్వడంపై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది. ఫిట్‌గా లేని, బౌలింగ్ చేయలేని హార్ధిక్ పాండ్యాని ఎంఎస్ ధోనీ చెప్పాడని టీమ్‌కి సెలక్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు టీమిండియా ఫ్యాన్స్...
Hardik Pandya
అయితే ఆసియా కప్ 2022 టోర్నీలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు హార్ధిక్ పాండ్యా. బౌలింగ్‌లో 3 వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా, బ్యాటింగ్‌లో 17 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసి... సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించాడు...
Hardik Pandya
హార్ధిక్ పాండ్యాని సౌతాఫ్రికా దిగ్గజం జాక్వస్ కలీస్‌తో పోల్చాడు పాక్ మాజీ క్రికెట్ కోచ్ మిక్కీ ఆథర్. ‘హార్ధిక్ పాండ్యా ఒక్కడూ ఇద్దరు ప్లేయర్లతో సమానం. అతన్ని తుదిజట్టులో ఆడించడం వల్లే టీమిండియా 12 మంది ప్లేయర్లతో బరిలో దిగినట్టైంది...
hardik
హార్ధిక్ పాండ్యా ఆటతీరు ఎప్పుడూ నాకు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వస్ కలీస్‌ని గుర్తుకుతెస్తుంది. టాప్ 5లో బ్యాటింగ్ చేస్తూ, టాప్ 4 సీమర్లలో ఒకడిగా బౌలింగ్ చేయగల ఆల్‌రౌండర్ దొరకడం ఏ టీమ్‌కైనా అదృష్టమే...
Image credit: PTI
హార్ధిక్ పాండ్యా చాలా మెచ్యూర్డ్‌గా ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో అతను జట్టుని నడిపించిన విధానం అద్భుతం. కీలక సందర్భాల్లోనూ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా హార్ధిక్ పాండ్యా, జట్టును చక్కగా నడిపించాడు...’ అంటూ కామెంట్ చేశాడు మిక్కీ ఆథర్...
Image credit: PTI
ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకున్న భారత జట్టు, ఆగస్టు 31న హంగ్‌కాంగ్‌తో మ్యాచ్ ఆడనుంది...