MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • పాక్‌కి వెళ్లినప్పుడు నాపైన రాళ్లు వేశారు! ‘జై శ్రీరామ్’ అంటే తప్పేంటి... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

పాక్‌కి వెళ్లినప్పుడు నాపైన రాళ్లు వేశారు! ‘జై శ్రీరామ్’ అంటే తప్పేంటి... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

అహ్మదాబాద్‌లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం అందుకుంది. ఈ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తున్న పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌ని చూస్తూ ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు కొందరు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్. ఈ ప్రవర్తనపై పాకిస్తాన్ క్రికెట్ కోచ్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 19 2023, 06:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

భారత్ చేతుల్లో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కూడా దీన్ని సాకుగా పెట్టుకుని, సానుభూతి పొందాలని ప్రయత్నించింది. అహ్మదాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ ప్రవర్తనపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఫ్యాన్స్ చేసిన దానికి తామేం చేయలేమని, వారికి కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తించదని తేల్చేసింది ఐసీసీ..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ దీనిపై స్పందించాడు. ‘నేను ఓ సారి పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాను. అప్పుడు నా పైకి రాళ్లు, ఐరన్ బోల్ట్‌లు విసిరారు. అందులో ఓ రాయి నా కళ్ల మధ్య తగిలింది. కంటికి తగిలి ఉంటే నా చూపు పోయి ఉండేది..

36

అయితే అభిమానులు చేసిన ఆ చిల్లర పనిని పట్టుకుని, మేం రచ్చ చేయాలని అనుకోలేదు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ మాత్రం చెత్త పర్ఫామెన్స్ కారణంగా వస్తున్న ట్రోలింగ్ తప్పించుకునేందుకు అహ్మదాబాద్ ఫ్యాన్స్ చేసిన చిన్న పనిని పెద్దది చేయాలని చూస్తోంది..’ అంటూ వ్యాఖ్యానించాడు ఇర్ఫాన్ పఠాన్..

46

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా దీనిపై ఘాటుగా స్పందించాడు. ‘పాకిస్తాన్ మహిళా జర్నలిస్ట్ జైనబ్ అబ్బాస్ ఇండియా గురించి, హిందువుల గురించి పిచ్చి పిచ్చి రాతలు రాస్తే తప్పులేదు..
 

56

ఐసీసీ ఈవెంట్‌లో పాకిస్తాన్ పాటలు వేయలేదని మిక్కీ ఆథర్, దీన్ని బీసీసీఐ ఈవెంట్ అంటే తప్పులేదు? ప్లే గ్రౌండ్‌లో, భారతీయుల మధ్య మహ్మద్ రిజ్వాన్ నమాజ్ చేస్తే తప్పులేదు.. ఎదుటివారిలోనే తప్పులు వెతకాలని చూడకండి?’ అంటూ ట్వీట్లు చేశాడు డానిష్ కనేరియా...

66

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా ఓటమి తర్వాత భారత జట్టుపై పాక్ ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మహ్మద్ షమీ, ఓ పాక్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. అయితే మిగిలిన టీమ్ ప్లేయర్లు, ఓటమి బాధతో డ్రెస్సింగ్ రూమ్‌కి సైలెంట్‌గా వెళ్లారే తప్ప, జనాల ప్రవర్తనను పెద్దది చూసి సానుభూతి పొందాలని చూడలేదు.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved