పాక్ క్రికెటర్లకు వైరల్ ఫివర్! టీమిండియాతో మ్యాచ్ ఓడిన తర్వాత జ్వరంతో...
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని వన్ ఆఫ్ ది ఫెవరెట్ టీమ్‌గా మొదలెట్టింది పాకిస్తాన్. మొదటి రెండు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్న పాకిస్తాన్, అహ్మదాబాద్‌లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది...
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అట్టర్ ఫ్లాప్ అయిన పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కి ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కి ముందు ఊహించని షాక్ తగిలింది. అహ్మదాబాద్‌లో ఇండియాతో మ్యాచ్ ఆడిన తర్వాత పాక్ జట్టులో ఆరుగురు ప్లేయర్లు వైరల్ ఫివర్ బారిన పడ్డట్టు సమాచారం..
అక్టోబర్ 14న మ్యాచ్ ముగిసిన తర్వాత అహ్మదాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చింది పాకిస్తాన్ క్రికెట్ టీమ్. అయితే పాక్ టీమ్‌లో సగం మందికి పైగా అనారోగ్యంతో బాధపడుతున్నారు...
ఈ విషయాన్ని పీసీబీ మీడియా మేనేజర్ అహ్సన్ ఇఫ్తికర్ నాగి తెలియచేశాడు. ‘అవును, పాక్ టీమ్‌లో కొందరు ప్లేయర్లు అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఇప్పటికే చాలామంది పూర్తిగా కోలుకున్నారు. మిగిలిన వాళ్లు మా మెడికల్ టీమ్ ప్యానెల్ పర్యవేక్షణలో ఉన్నారు..’ అంటూ తెలిపాడు అహ్సన్ ఇఫ్తికర్..
బాబర్ ఆజమ్‌తో పాటు షాహీన్ షా ఆఫ్రిదీ కూడా వైరల్ ఫివర్ బారిన పడి, పూర్తిగా కోలుకున్నారని అహ్సన్ ఇఫ్తికర్ తెలియచేశాడు. అయితే ఇంకా కోలుకోని వారిలో హారీస్ రౌఫ్, షాదబ్ ఖాన్ వంటి కీ ప్లేయర్లు ఉన్నారని తెలుస్తోంది..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా అక్టోబర్ 20న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడనుంది పాకిస్తాన్. తొలి రెండు మ్యాచుల్లో ఓడి శ్రీలంకపై బోణీ కొట్టింది ఆస్ట్రేలియా. బ్యాటింగ్ పిచ్‌లో ఆసీస్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది..