మాకు హైదరాబాదీ బిర్యానీయే కావాలి! హోటల్ ఫుడ్‌ని కాదని, బయటి నుంచి ఆర్డర్ చేసుకున్న పాక్ టీమ్...
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో రెండు విజయాల తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది పాకిస్తాన్ క్రికెట్ టీమ్. వరుస పరాజయాలతో సెమీస్ ఛాన్సులను సంక్లిష్టం చేసుకున్న పాక్ టీమ్‌పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి... వీటిల్లో ఎక్కువ ట్రోల్స్ వారి ఫిట్‌నెస్‌పైనే..
పాక్ క్రికెటర్ల ఫిట్‌నెస్‌పై పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ షాకింగ్ కామెంట్లు చేశాడు. ‘మా ప్లేయర్ల ఫిట్‌నెస్ లెవెల్స్‌ని ఓ సారి చూడండి. నేను మూడు వారాల వాళ్లను గమనిస్తున్నా, రన్నింగ్ చేయడానికి కూడా తెగ ఆయాసపడుతున్నారు. గత రెండేళ్లుగా వారికి ఫిట్‌నెస్ పరీక్షలే జరగలేదు..
ఒక్కొక్కరి పేరు చెప్పాలని ఉంది. అలా బయటపెడితే వాళ్లు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక సిగ్గుతో చచ్చిపోతారు. రోజూ 8 కిలోల మటన్ తింటారు. పాక్ క్రికెట్ టీమ్ బాగు పడాలంటే ముందు ఫిట్‌నెస్ టెస్టులు జరగాలి... ’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్..
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ కోసం కోల్‌కత్తాలో ఉన్న పాకిస్తాన్, హోటల్‌లో క్రికెట్ టీమ్ కోసం తయారుచేసిన హెల్తీ డైట్ ఫుడ్ కాకుండా బయటి నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారట. పాక్ క్రికెట్ టీమ్, కోల్‌కత్తాలోని పాపులర్ రెస్టారెంట్ జామ్ జామ్ నుంచి హైదరాబాదీ బిర్యానీని ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసినట్టు సమాచారం..
జామ్ జామ్ రెస్టారెంట్ సిబ్బంది ఈ విషయాన్ని ఖరారు చేసింది. జామ్ జామ్ స్పెషల్ హైదరాబాదీ బిర్యానీతో పాటు మటన్ కబాబ్స్, ఛాప్స్ స్పెషల్స్ వెరైటీలను పాక్ క్రికెట్ టీమ్ ఆర్డర్ చేసినట్టు జామ్ జామ్ రెస్టారెంట్ డైరెక్టర్ షాద్మన్ ఫైజీ తెలిపాడు..
ఆరు మ్యాచుల్లో రెండే విజయాలు అందుకున్న పాకిస్తాన్, మిగిలిన 3 మ్యాచుల్లో గెలిచినా సెమీస్ చేరడం కష్టమే. కోల్‌కత్తాలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడే పాక్ క్రికెట్ టీమ్, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో బెంగళూరులో, కల్‌కత్తాలో ఇంగ్లాండ్‌తో మ్యాచులు ఆడనుంది..