ప్రపంచంలో ఎక్కడైనా పాకిస్తాన్, ఇండియాని ఓడించగలదు! - పాక్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉంది. అయితే ఇప్పటికే అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌పై హైప్ ఆకాశాన్ని తాకింది. ఈ మ్యాచ్‌కి ముందే ఆసియా కప్ 2023 టోర్నీలో రెండు సార్లు ఇండియా- పాకిస్తాన్ తలబడబోతున్నాయి..
ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా కెండీలో సెప్టెంబర్ 2న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. సూపర్ 4 రౌండ్‌లో భాగంగా సెప్టెంబర్ 10న మరోసారి ఇండియా, పాకిస్తాన్ మధ్య కొలంబోలో మ్యాచ్ జరగొచ్చు. రెండు జట్లు ఫైనల్ చేరితే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందే దాయాదుల మధ్య 3 మ్యాచులు జరుగుతాయి..
ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్‌పై ఇండియాకి ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాక్ చేతుల్లో ఓడిన టీమిండియా, 2021 టీ20 వరల్డ్ కప్‌లోనూ పరాజయాన్ని చవిచూసింది. దీంతో పాక్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ పాకిస్తాన్‌దే విజయం అంటున్నాడు..
‘వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే బాగా ఆడడం ఒక్కటే మార్గం. మా రోజుల్లో మేం మేజర్ టోర్నమెంట్లలో ఇండియాపై ఎక్కువ మ్యాచులు గెలవలేకపోయాం. అయితే ఇప్పటి తరం ఇండియాని ఓడించడం మొదలెట్టారు. అది చాలా మంచి సంకేతం..
పాక్ టీమ్‌లో సత్తా ఉన్న ప్లేయర్లు పుష్కలంగా ఉన్నారు. మా టాలెంట్‌కి తగ్గట్టుగా ఆడితే ఎవ్వరినైనా ఓడించవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ ఏ టీమ్‌నైనా ఓడించగలదు. ఎక్కడ ఆడుతున్నాం అనేది అసలు మ్యాటరే కాదు..
ది ఓవల్‌లో ఇండియాని చిత్తు చేయగలిగినప్పుడు, పాకిస్తాన్ ఎక్కడైనా ఆ టీమ్‌ని ఓడించగలదు. పులుల్లా ఆడడం, ప్రత్యర్థిని వేటాడండి. భారత్‌ని ఓడించాలంటే అదొక్కటే మార్గం. ఆ రోజు ప్రెషర్‌ని ఎలా ఎదుర్కోగలం అనేది ఒక్కటే ముఖ్యం..
Rohit Sharma-Babar Azam
ఇండియాలో ఇండియాతో మ్యాచ్ అంటే కచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. అయితే మీకంటే టీమిండియాపైనే ఆ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. లక్షమంది ఫ్యాన్స్ మధ్య మ్యాచ్ ఓడిపోతే ఎలా ఉంటుందోనని వాళ్లు భయపడతారు..
ఆ భయం చాలు, వాళ్లపై పైచేయి సాధించడానికి. అతిగా ఉత్సాహం చూపిస్తే మ్యాచ్ రిజల్ట్ తారుమారు కావచ్చు. గెలవడం కోసం ఏం చేయాలో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్..