MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వాళ్లకి ఓవర్ కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువైంది, అందుకే ఓడిపోయారు... టీమిండియా ఓటమిపై ఇమ్రాన్ తాహీర్...

వాళ్లకి ఓవర్ కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువైంది, అందుకే ఓడిపోయారు... టీమిండియా ఓటమిపై ఇమ్రాన్ తాహీర్...

తాటి కాయ నెత్తిమీద పడి మామ ఏడుస్తుంటే, అల్లుడొచ్చి ఈత కల్లు తాగిపియ్యావా మామ అన్నాడట... టీమిండియా పొజిషన్ కూడా ఇలాంటిదే. టెస్టు సిరీస్‌ గెలవాలని సౌతాఫ్రికాకి వెళ్లి, వన్డే సిరీస్‌లో వైట్ వాష్ అయ్యి ఏడుస్తుంటే... సౌతాఫ్రికా సీనియర్ ప్లేయర్ ఇమ్రాన్ తాహీర్, టీమిండియా ప్లేయర్ల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే వాళ్లు ఇలా ఓడిపోయారంటున్నాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 24 2022, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సౌతాఫ్రికాలో ఆడిన మొదటి టెస్టులో విజయాన్ని అందుకుని, ఘన విజయంతో టూర్‌ను ఆరంభించింది భారత జట్టు. సెంచూరియన్‌లో తొలి టెస్టు విజయాన్ని నమోదుచేసింది...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

అయితే ఆ తర్వాత రెండో టెస్టులో విరాట్ కోహ్లీ వెన్నునొప్పితో బరిలో దిగకపోవడం, ఆ తర్వాత పరిస్థితులన్నీ సౌతాఫ్రికాకే అనుకూలించే మారిపోవడం జరిగిపోయాయి...

39

వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పిస్తూ బీసీసీఐ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం కారణంగా వన్డే సిరీస్‌లో భారత జట్టు, సౌతాఫ్రికా చేతుల్లో వైట్ వాష్‌ అవ్వాల్సి వచ్చింది...

49

‘నేను ఏ జట్టు ప్రదర్శనపై వ్యాఖ్యలు చేయను. అయితే టీమిండియా చాలా మంచి జట్టు. వారిలో చాలా స్టార్ ప్లేయర్లు, మ్యాచ్ విన్నర్లు ఉన్నారు...

59

టీమిండియాతో పోలిస్తే సౌతాఫ్రికా జట్టుకి పెద్దగా అనుభవం కూడా లేదు, ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. అయితే సౌతాఫ్రికా జట్టును భారత జట్టు పూర్తిగా తక్కువ అంచనా వేసింది...

69

మొదటి టెస్టు విజయం తర్వాత వారిలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది... తేలిగ్గా సౌతాఫ్రికాను చిత్తు చేస్తామని అనుకున్నారు. భారత జట్టు ఓటమికి అసలు కారణం అదే...

79

టెస్టుల్లో భారత జట్టు వరల్డ్ క్రికెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్. వన్డేల్లో కూడా నాలుగైదు ఏళ్లుగా సంచలన ప్రదర్శన ఇస్తోంది... అయితే అనుభవం లేని ఈ సఫారీ జట్టు అద్భుతమై చేసింది...

89

గెలవాలనే కసి ఉంటే చాలు, ఏ జట్టునైనా ఓడించవచ్చని సౌతాఫ్రికా చేసి చూపించింది. సొంత మైదానం, పిచ్, కలిసి వచ్చిన అవకాశాలను పక్కాగా వాడుకోవడంలో సౌతాఫ్రికా సూపర్ సక్సెస్ అయ్యింది...

99

నాకు తెలిసి సౌతాఫ్రికాకి ఈ మధ్యకాలంలో ఇది అతి పెద్ద విజయం. టీమిండియా లాంటి స్ట్రాంగ్ టీమ్‌ను క్లీన్ స్వీప్ చేయడం, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్...

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Retirement : CSK తోనే ప్రారంభం, సిఎస్కేతోనే ముగింపు : ఐపిఎల్ కు టీమిండియా మాజీ ప్లేయర్ గుడ్ బై
Recommended image2
Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పాయే.. ఇప్పుడు టీమిండియా నుంచి ఔట్? హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్
Recommended image3
IPL 2026: ముంబైకి కేకేఆర్ షాక్.. ప్లేఆఫ్స్ రేసులోకి కోల్‌కతా.. ఆ ఫోర్త్ బెర్త్ ఎవరిదో?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved