- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీ ఆరంగ్రేటానికి 15 ఏళ్లు... అప్పటి నుంచి ఇప్పటిదాకా కోహ్లీ టచ్ చేయని...
విరాట్ కోహ్లీ ఆరంగ్రేటానికి 15 ఏళ్లు... అప్పటి నుంచి ఇప్పటిదాకా కోహ్లీ టచ్ చేయని...
సచిన్ టెండూల్కర్ తర్వాత క్రికెట్ ప్రపంచాన్ని అంతలా ప్రభావితం చేసిన పేరు విరాట్ కోహ్లీ. సచిన్ సుదీర్ఘ కెరీర్‌లో రికార్డుల కోటలు నిర్మిస్తే, విరాట్ కోహ్లీ వాటిని బ్రేక్ చేయడానికి వచ్చినట్టుగా దూసుకొచ్చాడు...

Virat Kohli
విరాట్ కోహ్లీ అంతర్జాతీయ ఆరంగ్రేటానికి నేటికి (ఆగస్టు 18) సరిగ్గా 15 ఏళ్లు. తన తండ్రి చనిపోయిన 18వ తేదీని జెర్సీ నెంబర్‌గా ఎంచుకున్న విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసింది కూడా 18వ తారీఖే కావడం విశేషం..
2008, ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు విరాట్ కోహ్లీ. 2008, మార్చిలో కెప్టెన్‌గా అండర్19 వరల్డ్ కప్ గెలిచిన విరాట్ కోహ్లీ, 5 నెలల గ్యాప్‌లో టీమిండియాలోకి వచ్చేశాడు..
Sanju and Kohli
అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసే సమయానికి విరాట్ కోహ్లీకి కేవలం 8 లిస్టు-ఏ మ్యాచులు ఆడిన అనుభవం మాత్రమే ఉంది. తొలి మ్యాచ్‌లో 12 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, తన నాలుగో మ్యాచ్‌లో 54 పరుగులు చేసి మొదటి హాఫ్ సెంచరీ అందుకున్నాడు..
విరాట్ కోహ్లీ ఆరంగ్రేటం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ అత్యధిక అంతర్జాతీయ పరుగులు (25,582), అత్యధిక హాఫ్ సెంచరీలు (131), అత్యధిక సెంచరీలు (76), అత్యధిక 150+ పరుగులు (16), అత్యధిక డబుల్ సెంచరీలు (7), అత్యధిక ఫోర్లు (2533)... ఇలా డజనుకి పైగా రికార్డులు కోహ్లీ పేరిట లిఖించబడ్డాయి...
Virat Kohli
అత్యధిక సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులే కాదు, ఐసీసీ అవార్డుల్లోనూ విరాట్ కోహ్లీదే హవా. కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు (41), అత్యధిక డబుల్ సెంచరీలు (7) చేసిన విరాట్ కోహ్లీ... ఐసీసీ టీమ్ కెప్టెన్‌గా అత్యధిక సార్లు (8 సార్లు) నిలిచాడు..
అంతర్జాతీయ ఆరంగ్రేటానికి 15 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా 2022 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫోటోను షేర్ చేసిన విరాట్ కోహ్లీ, ‘ఎప్పటికీ రుణపడిఉంటా...’ అంటూ కాప్షన్ జోడించాడు.. ఈ మ్యాచ్‌లో విరాట్ వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత జట్టు ఘన విజయం అందుకున్న విషయం తెలిసిందే..
2011 వన్డే వరల్డ్ కప్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో 282 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 2015 వన్డే వరల్డ్ కప్‌లో 8 ఇన్నింగ్స్‌ల్లో 305 పరుగులు చేశాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో 443 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ..
2023 వన్డే వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీపై భారీ అంచనాలే పెట్టుకుంది టీమిండియా మేనేజ్‌మెంట్. విరాట్‌కి ఇదే ఆఖరి వన్డే వరల్డ్ కప్ కూడా కావచ్చు. కాబట్టి ఈసారి వరల్డ్ కప్ గెలిచి, తన కెరీర్‌లో మరో మైలురాయిని చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు విరాట్ కోహ్లీ...