MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆ రెండు జట్లు మాత్రమే టైటిల్ గెలుస్తాయా... జాగ్రత్తగా ఉండాలంటున్న మహేంద్ర సింగ్ ధోనీ...

ఆ రెండు జట్లు మాత్రమే టైటిల్ గెలుస్తాయా... జాగ్రత్తగా ఉండాలంటున్న మహేంద్ర సింగ్ ధోనీ...

ఐపీఎల్ 2022 సీజన్‌కి సైరన్ మోగింది. మరో 11 రోజుల్లో మెగా లీగ్ ప్రారంభం కానుంది. 10 ఫ్రాంఛైజీలు పాల్గొనే ఐపీఎల్ 2022 సీజన్‌కి ప్రచార కార్యక్రమాలను జోరుగా చేస్తోంది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్. తాజాగా విడుదల చేసిన ప్రోమో, అందర్నీ ఆకట్టుకుంటోంది..

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 15 2022, 08:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

కొత్త జట్లతో జాగ్రత్తగా ఉండాలని హార్ధిక్ పాండ్యా, ఓ ప్రోమోలో మిగిలిన జట్లను హెచ్చరిస్తే... అదే ప్రోమోలో కొన్ని మార్పులు చేసి రూపొందించారు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఈసారి పసుపు, నీలి రంగు వైర్లను వదిలేసి మిగిలిన వైర్లను కట్ చేస్తామని చెబుతుంటారు బాంబ్ స్వ్కార్డ్. మాహీ వారిని వద్దని వారిస్తూ ఉండగానే, బాంబ్ పేలిపోతుంది...

310

‘కేవలం పసుపు, నీలి రంగు జట్లు మాత్రమే పేలుతాయని అనుకుంటే ఎలా? ప్రతీ ఫ్రాంఛైజీతోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే...’ అంటూ హెచ్చరించాడు మహేంద్ర సింగ్ ధోనీ...

410

నీలి రంగు జెర్సీ ఉండే ముంబై ఇండియన్స్... ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవగా, పసుపు పచ్చ జెర్సీ ఉండే చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే...

510

ఐపీఎల్ 2020 సీజన్‌లో కనీసం ప్లేఆఫ్స్‌కి కూడా చేరకుండా ఏడో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్... ఆ తర్వాతి సీజన్‌లోనే అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చి నాలుగోసారి టైటిల్ గెలిచింది...

610

11 సీజన్లలో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించి, 9 సార్లు ఫైనల్ చేరిన ఏకైక జట్టుగా నిలిచింది సీఎస్‌కే. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్ ఆడేందుకు మిగిలిన జట్లన్నీ 60 రోజుల పాటు పోటీపడతాయని వ్యంగ్యంగా చెబుతారు క్రికెట్ ఫ్యాన్స్...

710

అయితే 10 ఫ్రాంఛైజీలు పాల్గొనే ఐపీఎల్ 2022 సీజన్‌లో ఏ జట్టునీ తక్కువ అంచనా వేయడానికి లేదంటున్నాడు ఎమ్మెస్ ధోనీ...

810

40 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే ప్లేయర్‌గా ఆఖరి సీజన్ అని ప్రచారం జరుగుతోంది. గత సీజన్‌లో సీఎస్‌కే, టైటిల్ గెలిచినా మాహీ బ్యాటు నుంచి మెరుపులు చూసే అవకాశం దొరకలేదు...

910

ఈసారి అయినా మాహీ బ్యాటు నుంచి వచ్చే మెరుపులు చూడాలని కోరుకుంటున్నారు ఎమ్మెస్ ధోనీ ఫ్యాన్స్. నెల రోజుల ముందు నుంచే నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు ధోనీ... 

1010

ఎమ్మెస్ ధోనీ ఆఖరి ఐపీఎల్ సీజన్ కావడంతో ఈసారి కూడా టైటిల్ గెలిచి, ఘనంగా మాహీకి వీడ్కోలు ఇవ్వాలని భావిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్ టీమ్...

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved