- Home
- Sports
- Cricket
- ఫైనల్ కంటే ఆ మ్యాచ్‌కే ఎక్కువ... జియో సినిమాతో పాటు స్టార్ స్పోర్ట్స్‌లోనూ ఐపీఎల్ 2023 బంపర్ హిట్...
ఫైనల్ కంటే ఆ మ్యాచ్‌కే ఎక్కువ... జియో సినిమాతో పాటు స్టార్ స్పోర్ట్స్‌లోనూ ఐపీఎల్ 2023 బంపర్ హిట్...
ఐపీఎల్ 2023 సీజన్ బీసీసీఐకి కాసుల వర్షం కురిపించింది. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో ఊహించని ట్విస్టులు ఫ్యాన్స్‌కి ఓ కొత్త అనుభవాన్ని ఇచ్చాయి. దీంతో 2022 డిజాస్టర్ సీజన్ తర్వాత 2023లో రిజల్ట్ అదిరిపోయింది...

Image credit: PTI
ఈజీగా గెలుస్తారనుకున్న టీమ్స్, చిత్తుగా ఓడిపోవడం... ఇక ఓడిపోయినట్టే అనుకున్న టీమ్స్, ఊహించని విధంగా విజయం అందుకోవడం... ఐపీఎల్ 2023 సీజన్‌లో చాలా కామన్‌గా కనిపించిన దృశ్యాలు. ఇదంతా స్క్రిప్టు ప్రకారం నడుస్తున్న టోర్నీ అని చాలామంది అభిమానులు కొట్టేసినా, వాళ్లు కూడా చూడడం మానలేదు...
Image credit: PTI
ఐపీఎల్ 2023 డిజిటల్ రైట్స్ తీసుకున్న వయాకామ్‌కి ఈ సీజన్‌లో బాగానే కలిసి వచ్చింది. జియోసినిమా యాప్‌లో 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకూ రియల్ టైం నమోదైంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రియల్ టైం 3.2 కోట్లకు దాటింది..
Sai Sudharsan
అంతకుముందు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 2.2 కోట్ల నుంచి 2.8 కోట్ల వరకూ నమోదైన రియల్ టైం వ్యూస్‌ని 21 ఏళ్ల అన్‌క్యాప్డ్ పోరగాడు చిత్తగొట్టి, పక్కనపడేశాడు.
Image credit: PTI
2023 సీజన్ శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసిన స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కి కూడా బాగానే కలిసి వచ్చిందట... వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగి అర్ధరాత్రి ఫలితం తేలిన ఫైనల్ మ్యాచ్ కంటే అంతకుముందు గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌కి టీవీల్లో బీభత్సమైన రెస్పాన్స్ రావడం విశేషం...
రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ సమయంలో ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో 6.1 కోట్ల రియల్ టైం పీక్ నమోదైందట. మొబైళ్ల ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో ఇంతమంది ఓ ఐపీఎల్ మ్యాచ్ చూడడం ఇదే అత్యధికం...
Image credit: PTI
బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కి చేరడంతో ఐపీఎల్ 2023 ఫైనల్‌కి కూడా టీఆర్పీ పేలిపోయి ఉండాల్సింది. అందులోనూ మాహీ లాస్ట్ ఐపీఎల్ మ్యాచ్ అనే ప్రచారం జరగడంతో ఫైనల్‌కి మంచి క్రేజ్ వచ్చింది...
అయితే వర్షం కారణంగా ఓ రోజు ఆలస్యంగా సోమవారం రోజు మ్యాచ్ జరగడం, అప్పుడు కూడా వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ అర్ధరాత్రి 12 గంటలకు మొదలుకావడం టీఆర్పీపై ప్రభావం చూపించింది...