- Home
- Sports
- Cricket
- అతని ముందు బుమ్రా, షాహీన్ ఆఫ్రిదీ పిల్ల బచ్చాలు... మిచెల్ స్టార్క్‌పై దినేశ్ కార్తీక్ కామెంట్...
అతని ముందు బుమ్రా, షాహీన్ ఆఫ్రిదీ పిల్ల బచ్చాలు... మిచెల్ స్టార్క్‌పై దినేశ్ కార్తీక్ కామెంట్...
విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 117 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని 11 ఓవర్లలోనే ఊది పడేసింది ఆస్ట్రేలియా. వన్డే క్రికెట్ చరిత్రలోనే చెత్త ఓటమిని మూటకట్టుకుంది టీమిండియా. దీనికి ప్రధాన కారణం మిచెల్ స్టార్క్ బౌలింగ్...

Image credit: PTI
మొదటి ఓవర్ మూడో బంతికి శుబ్‌మన్ గిల్‌ని అవుట్ చేసిన మిచెల్ స్టార్క్, ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లను వెంటవెంటనే పెవిలియన్ చేర్చాడు. తొలి వన్డేలో స్టార్క్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్, రెండో వన్డేలోనూ అదే విధంగా అవుట్ అయ్యాడు...
Image credit: PTI
తొలి వన్డేలో 9.5 ఓవర్లలో 49 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్, రెండో వన్డేలో 8 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 53 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టీమిండియా టాపార్డర్‌ని కకావికలం చేసిన స్టార్క్, సిరాజ్‌ని క్లీన్ బౌల్డ్ చేసి ఆఖరి వికెట్ కూడా తన ఖాతాలోనే వేసుకున్నాడు...
109 వన్డేల్లో 9వ సార్లు ఐదు వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్, వకార్ యూనిస్, ముత్తయ్య మురళీధరన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. వకార్ యూనిస్ 262 మ్యాచుల్లో 13 సార్లు ఐదేసి వికెట్లు తీస్తే, ముత్తయ్య మురళీ ధరన్ 350 మ్యాచుల్లో 10 సార్లు ఈ ఫీట్ సాధించాడు. మిచెల్ స్టార్క్ మాత్రం కేవలం 109 మ్యాచుల్లోనే 9 సార్లు ఈ ఫీట్ సాధించాడు..
Starc to Kohli
‘బెస్ట్ వైట్ బాల్ బౌలర్ ఎవ్వరంటే చాలా మంది జస్ప్రిత్ బుమ్రా, షాహీన్ ఆఫ్రిదీ పేర్లు చెబుతారు. అయితే ప్రస్తుత తరంలో బెస్ట్ వైట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఒక్కడే. బుమ్రా అయినా ఆఫ్రిదీ అయినా అతని తర్వాతే...
Surya Out
మిచెల్ స్టార్క్ బౌలింగ్‌ని ఎదుర్కోవడం ఎలాంటి బ్యాటర్‌కి అయినా కష్టమే. క్రీజులో ఎలాంటి బ్యాటర్‌ని పెట్టినా, అతన్ని మొదటి బంతికే అవుట్ చేసే సత్తా మిచెల్ స్టార్క్‌కి ఉంది. సూర్యకుమార్ యాదవ్ లాంటి బ్యాటర్‌ని స్టార్క్, రెండు మ్యాచుల్లో డకౌట్ చేశాడు...
Mitchell Starc
లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ల బౌలింగ్‌ని ఎదుర్కొనేటప్పుడు బ్యాటర్లు కొద్దిగా ఇబ్బంది పడతారు. షాహీన్ ఆఫ్రిదీ, ట్రెంట్ బౌల్ట్ సక్సెస్‌కి ఇదే కారణం. అయితే మిచెల్ స్టార్క్ డిఫరెంట్ బాస్... ఇలాంటి సత్తా ఉన్న బౌలర్లు మన దగ్గర కూడా ఉన్నారు..
Image credit: Getty
అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయడం, నెట్స్‌లో బౌలింగ్ చేయడం ఒక్కటి కాదు. అందుకే మన బౌలర్లు కీలక మ్యాచుల్లో ఫెయిల్ అవుతున్నారు. వన్డే వరల్డ్ కప్‌లో మిచెల్ స్టార్క్‌ని ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు పెద్ద ఛాలెంజ్ కావచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్..