- Home
- Sports
- Cricket
- టీమిండియా కొత్త కోచ్ రేసులో రికీ పాంటింగ్, టామ్ మూడీ... బీసీసీఐ ఆసక్తికర అప్‌డేట్...
టీమిండియా కొత్త కోచ్ రేసులో రికీ పాంటింగ్, టామ్ మూడీ... బీసీసీఐ ఆసక్తికర అప్‌డేట్...
ఐపీఎల్ 2021 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్ 2021 మెగా టోర్నీ. అది ముగిసాక మరో ఏడు నెలల పాటు బిజీ బిజీ షెడ్యూల్... ఈ గ్యాప్‌లో కొత్త కోచ్‌ను నియమించాల్సిన పరిస్థితి బీసీసీఐ...

భారత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీకాలం, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో ముగియనుంది... షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే లక్కీగా టీమిండియా, టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఫైనల్‌కి చేరితే... ఆ మ్యాచ్ తర్వాత మూడు రోజులకే న్యూజిలాండ్‌తో టీ20 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది...
నవంబర్ 14న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంటే, దాని తర్వాత సరిగ్గా మూడు రోజులకు నవంబర్ 17న జైపూర్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది...
టీమిండియా, న్యూజిలాండ్ జట్లు కచ్ఛితంగా ఫైనల్ దాకా వచ్చే అవకాశం లేదని గట్టిగా ఫిక్స్ అయిపోయి, ఈ షెడ్యూల్‌ను ఫిక్స్ చేసి ఉంటారని కొందరు క్రికెట్ విశ్లేషకుల అంచనా...
ఆ విషయం పక్కనబెడితే టీమిండియా తర్వాతి కోచ్ ఎవరు? అనే ప్రశ్న అందరిలో ఆసక్తి రేపుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డు బీసీసీఐ హెడ్ కోచ్‌గా వచ్చేందుకు ఆసీస్ మాజీ క్రికెటర్లు కూడా అత్యంత ఆసక్తిగా ఉన్నారు....
సన్‌రైజర్స్ హైదరాబాద్ డైరెక్టర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ... భారత జట్టు ప్రధాన కోచ్ పదవి స్వీకరించేందుకు ఆసక్తిగా ఉన్నాడని వార్తలు వినిపించాయి...
అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ లెజెండరీ క్రికెటర్ రికీ పాంటింగ్, టీమిండియా తర్వాతి కోచ్‌గా వస్తే బాగుంటుందని కూడా చాలామంది కోరుకుంటున్నారు...
అయితే బీసీసీఐ మాత్రం విదేశీ కోచ్‌లను నియమించేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదని తేల్చి చెప్పేసింది...
‘భారత క్రికెట్ జట్టుకి విదేశీ కోచ్‌లతో అవసరం లేదు. భారత జట్టుకి సేవలు అందించి, కోచ్‌లుగా రాణించినవాళ్లు చాలామంది మనదగ్గరే పుష్కలంగా ఉన్నారు’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు...
భారత జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్, పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్, భారత మాజీ కోచ్ అనిల్ కుంబ్లేల పేర్లు కూడా టీమిండియా హెడ్‌కోచ్ రేసులో ఉన్నట్టు వార్తలు వచ్చాయి...
అయితే రాహుల్ ద్రావిడ్ మాత్రం భారత జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడడం లేదని సమాచారం...