ఇప్పుడే కాదు, ఇంకో ఐదేళ్లు ఈజీగా ఆడేస్తా... యువరాజ్ రికార్డు కొడతా... విండీస్ ప్లేయర్ క్రిస్‌గేల్ కామెంట్...
First Published Jan 1, 2021, 8:06 PM IST
చాలామంది క్రికెటర్లు మూడు పదుల వయసు దాటిన తర్వాత క్రికెట్ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటే.. నాలుగు పదుల వయసు దాటిన తర్వాత చాలా తేలిగ్గా భారీ సిక్సర్లు బాదుతున్నాడు కరేబియన్ ‘టార్జాన్’ క్రిస్‌గేల్. 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత క్రిస్‌గేల్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా భావించారు... అయితే ఆ ఆలోచన లేదని చెప్పిన క్రిస్‌గేల్, ఇప్పట్లో క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచనే లేదని అంటున్నాడు.

విండీస్ తరుపున అత్యధిక వన్డే పరుగులు చేసిన క్రికెటర్‌గా, బ్రియాన్ లారా రికార్డును అధిగమించిన క్రిస్ గేల్... ఐదేళ్లు వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహారించాడు...

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క్రిస్ గేల్... అన్ని ఫార్మాట్లలోనూ తన పేరిట అరుదైన రికార్డులను క్రియేట్ చేసుకున్నాడు...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?