టీ20ల నుంచి తప్పుకోలేదు! రెస్ట్ లేకుండా ఆడడం కష్టం... రోహిత్ శర్మ కామెంట్...
రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక ఆడిన మ్యాచుల కంటే రెస్ట్ పేరుతో తప్పుకున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ. రోహిత్ ఫిట్‌నెస్ కారణంగా ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లను మార్చింది టీమిండియా. ఎన్ని విమర్శలు వచ్చినా ఈ వయసులో వరుసగా సిరీస్‌లు ఆడడం తన వల్ల కాదంటున్నాడు రోహిత్ శర్మ..

శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లకు చోటు దక్కలేదు. దీంతో ఈ ఇద్దరూ టీ20 సిరీస్‌కి దూరంగా ఉంటూ వన్డే, టెస్టులపై ఫోకస్ పెట్టారని టాక్ వినిపించింది. మరికొందరైతే సీనియర్లను టీ20ల నుంచి తప్పించారని అన్నారు..
‘ఈ ఏడాది 50 ఓవర్ల ఫార్మాట్‌లో వరల్డ్ కప్ ఆడబోతున్నాం. టీమ్‌లో కొందరు ప్లేయర్లు అన్ని ఫార్మాట్లు ఆడలేరు. టీమిండియా షెడ్యూల్ ఎలా ఉందో అందరికీ తెలుసు. సిరీస్‌ల మీద సిరీస్‌లతో బిజీ బిజీగా గడపాల్సి ఉంటుంది. ఓ మ్యాచ్ ముగిసిన రెండు రోజులకే మరో మ్యాచ్...
Image credit: Getty
అందుకే ప్లేయర్లపై ఒత్తిడి పడకుండా వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ తీసుకొచ్చాం. ప్రతీ ప్లేయర్‌కి బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాం. నేను కూడా ఈ జాబితాలో ఉన్నాను. ఈ వయసులో మూడు ఫార్మాట్లు, అన్ని మ్యాచులు ఆడాలంటే కష్టం. అందుకే బ్రేకులు తీసుకుంటున్నా...
ఇప్పటిదాకా ఆరు టీ20 మ్యాచులే అయ్యాయి. వాటిల్లో ఆడనంత మాత్రాన టీ20ల నుంచి తప్పుకున్నట్టు కాదు. టీ20 ఫార్మాట్‌లో కూడా ఆడతాను. ఐపీఎల్ ముగిసిన తర్వాత మాకు ఓ క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే అన్ని ఫార్మాట్లు ఆడాలనే అనుకుంటున్నా...
Jasprit Bumrah
జస్ప్రిత్ బుమ్రా గాయం నుంచి కోలుకున్నా, అతన్ని వెంటనే ఆడించడం కరెక్ట్ కాదని టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది. అందుకే అతన్ని వన్డే సిరీస్‌లో ఆడించకూడదని ఫిక్స్ అయ్యాం. అతను త్వరలోనే టీమిండియా తరుపున మ్యాచులు ఆడతాడు...’ అంటూ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ..