విరాట్ కోహ్లీ కోసం వరల్డ్ కప్ గెలవాలని టీమ్‌లో అందరూ అనుకోవడం లేదు! - హర్భజన్ సింగ్
2011 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు అంచనాలను మించి, రాణించి ప్రపంచ కప్ టైటిల్ కైవసం చేసుకుంది. అప్పటికే ఐదు ప్రపంచ కప్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ కోసం వరల్డ్ కప్ గెలిచి తీరాలని, టీమ్‌లో ప్రతీ ప్లేయర్ అనుకున్నాడు..
‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ యువరాజ్ సింగ్, క్యాన్సర్‌తో బాధపడుతూనే వన్డే వరల్డ్ కప్ ఆడాడు. దీనికి ప్రధాన కారణం తన ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్‌కి వరల్డ్ కప్ అందించాలనే కసి బలంగా ఉండడమే..
Sachin Tendulkar- Virat Kohli
ఎమ్మెస్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్, విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్... ఇలా 2011 వన్డే వరల్డ్ కప్ ఆడిన ప్రతీ ప్లేయర్ కూడా సచిన్ కోసం వరల్డ్ కప్ గెలిచి తీరాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు..
ప్రస్తుతం 2023 వన్డే వరల్డ్ కప్‌ని విరాట్ కోహ్లీ కోసం గెలవాలని చాలామంది మాజీలు కామెంట్ చేశారు. సురేష్ రైనాతో పాటు సునీల్ గవాస్కర్ వంటి మాజీ క్రికెటర్లు, ఈసారి విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ గెలవాలని కామెంట్లు చేశారు..
‘2011 వన్డే వరల్డ్ కప్, 2023 వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న టీమ్స్ మధ్య చాలా తేడాలు ఉన్నాయి. 2011 టీమ్‌లో అందరం కలిసి కట్టుగా ఉన్నాం. టీమ్‌లోని ప్రతీ ఒక్కరూ కూడా టెండూల్కర్ కోసం టైటిల్ గెలవాలని కోరుకున్నారు..
అయితే 2023 టీమ్ అలా లేదు. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ సాధించిన గౌరవం, విరాట్ కోహ్లీ సంపాదించగలిగాడా? అనేది నా డౌట్. టీమ్‌లోని అందరూ విరాట్ కోహ్లీ కోసమే వరల్డ్ కప్ గెలవాలని అయితే అనుకోవడం లేదు..
అయితే దేశం కోసం వరల్డ్ కప్ గెలవాలనే తపన మాత్రం అందరిలో ఉంది. దేశం కోసం ఆడుతున్నప్పుడు అదే గొప్ప. ఏ ఒక్కరి కోసం ఏ మ్యాచ్ గెలవాల్సిన అవసరం లేదు. నాకు ఇది చాలా గొప్ప సంతృప్తినిచ్చిన విషయం..
అభిమానులు నా సక్సెస్ చూడాలని పూజలు చేస్తారు. మేం భారత్ గెలవాలని కోరుకుంటాం. కోహ్లీ గెలవాలని, లేదా రాహుల్ ద్రావిడ్ గెలవాలని ఎప్పుడూ ప్రార్థించలేదు. ఇండియా గెలిస్తే అందరూ గెలిచినట్టే..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్..