MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • బుమ్రా లేకపోతేనేం ఓరియో ఉందిగా... వరల్డ్ కప్‌ మనదే! ధోనీపై ఆగని ట్రోల్స్...

బుమ్రా లేకపోతేనేం ఓరియో ఉందిగా... వరల్డ్ కప్‌ మనదే! ధోనీపై ఆగని ట్రోల్స్...

సినిమాల్లో మెగాస్టార్ ఏం చేసినా ట్రెండ్ సెట్టరే. అలాగే క్రికెట్‌లో ఎంఎస్ ధోనీ కూడా. మాహీ చేసిన కొన్ని కామెంట్లు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా మిగిలిపోయాయి. మరికొన్ని సార్లు ఆయన చేసిన కామెంట్లు తీవ్రమైన ట్రోలింగ్ రావడానికి కారణమయ్యాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 30 2022, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు హడావుడిగా ఫేస్‌బుక్ లైవ్‌లోకి వస్తున్నట్టు ప్రకటించాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. మాహీ ఏం చెబుతాడా? అని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు పెద్ద బిస్కెట్ వేశాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Image credit: MS Dhoni/Facebook

Image credit: MS Dhoni/Facebook

ఓరియో బిస్కెట్ ప్రమోషన్‌ కార్యక్రమం పాల్గొన్న మహేంద్ర సింగ్ ధోనీ... ‘2011లో ఇండియాలో ఓరియో లాంఛ్ అయ్యింది.. 2011లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది...’ అంటూ పదే పదే చెప్పాడు. ‘ఈసారి కూడా ఓరియో ఇండియాలో రీలాంఛ్ అవుతోంది. ఈసారి కూడా ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు మాహీ...

38

ఈ కామెంట్లతో మీమర్లకు అడ్డంగా దొరికిపోయాడు మహేంద్ర సింగ్ ధోనీ. అసలే కొన్నాళ్లుగా సరైన ఐటెం దొరకక, ఇన్‌స్టా ముందు గుంటనక్కలా ఎదురుచూస్తున్న మీమర్లు... మాహీ కామెంట్లతో రెచ్చిపోయారు. ధోనీని ఎన్ని రకాలుగా ట్రోల్ చేయొచ్చు, అన్ని రకాలుగానూ ట్రోల్ చేస్తున్నారు...

48

తాజాగా భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా గాయంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. జడేజా దూరమైనా అతని ప్లేస్ భర్తీ చేయడానికి హిట్టర్లు చాలా మంది ఉన్నారు. కానీ జస్ప్రిత్ బుమ్రా ప్లేస్‌ని రిప్లేస్ చేయడానికి సరైన ప్లేయర్ ఎవరూ కనబడని పరిస్థితి...

58
Image credit: Getty

Image credit: Getty

మహ్మద్ షమీ ఈ ఏడాది ఇప్పటిదాకా ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఆవేశ్ ఖాన్ పెద్దగా ఆకట్టుకోలేదు. శార్దూల్ ఠాకూర్ మునుపటిలా రాణించడం లేదు. భువనేశ్వర్ కుమార్ డెత్ ఓవర్లలో పసి లేకుండా బౌలింగ్ వేస్తున్నాడు...

68
bumrah

bumrah

హర్షల్ పటేల్ రిథమ్ అందుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు. నవ్‌దీప్ సైనీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్‌లను వాడే ఉద్దేశంలో సెలక్టర్లు కనిపించడం లేదు. దీంతో బుమ్రా లేకుండా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా టైటిల్ గెలవలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి...

78
Dhoni Batting

Dhoni Batting

ఈ పరిస్థితులను కూడా ట్రోలింగ్‌కి వాడుకుంటున్నారు కొందరు మీమీ క్రియేటర్లు. జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా లేకపోయినా ఆఖరికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోయినా ఈ సారి టీమిండియా వరల్డ్ కప్ 2022 గెలుస్తుందని ... ఎందుకంటే బుమ్రా లేకపోయినా ఓరియో ఉందిగా! అంటూ మాహీ కామెంట్లను ట్రోల్ చేస్తున్నారు...

88

ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత జట్టు పరిస్థితి కాస్త తేడా కొట్టినా ఈ ఓరియో ‘బిస్కెట్లు’ మీమ్స్ మళ్లీ బయటికి రావచ్చు... అవకాశం దొరికిన ప్రతీసారీ తమ క్రియేటివిటీతో మళ్లీ మళ్లీ మాహీని ట్రోల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు చాలామంది మీమ్ మేకర్లు...

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image2
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Recommended image3
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved