MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • Nitish Kumar Reddy : మన రెడ్డిగారు రెచ్చిపోయారో ... బౌలర్లకు దబిడిదిబిడే

Nitish Kumar Reddy : మన రెడ్డిగారు రెచ్చిపోయారో ... బౌలర్లకు దబిడిదిబిడే

Indian Premier League 2025 : మన తెలుగు క్రికెట్ నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు టీం కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఈ ఐపిఎల్ లో కూడా అతడు రెచ్చిపోతే ప్రత్యర్థి బౌలర్లకు దబిడిదిబిడే. 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 26 2025, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Nitish Kumar Reddy

Nitish Kumar Reddy

నితీష్ కుమార్ రెడ్డి :  తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన యువ సంచలనం ... గత ఐపిఎల్ సీజన్ లో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్ప్ లు ఆడి సన్ రైజర్స్ హైదరాబాద్ కు అద్భుత విజయాలు అందించాడు. దీంతో ఒక్కసారిగా నితీష్ రెడ్డి స్టార్ అయిపోయాడు... ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ ను అందుకున్నాడు.  

ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా జట్టును గెలిపించుకోగలనని నితీష్ నిరూపించాడు. అతడి ధనాధన్ బ్యాటింగ్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది... ఇక మన తెలుగోడే కాబట్టి నితీష్ పై కొంచెం అభిమానం ఎక్కువుంటుంది. అభిమానులు 'నిజాంపేట్ నితీష్' అని ముద్దుగా పిలుచుకుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Nitish Kumar Reddy

Nitish Kumar Reddy

తెలుగోడి ఆటంటే ఆమాత్రం ఉంటుంది... 

అతడు క్రీజులో కుదురుకుని అలవోకగా బౌండరీలు బాదుతుంటే మెల్లిగా మ్యాచ్ ప్రత్యర్థుల చేతిలోంచి జారిపోతుంది. ఇక నితీష్ పూనకం వచ్చినట్లు ఆడాడో అంతే సంగతి... గ్రౌండ్ చిన్నబోవడం, ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. 

విశాఖపట్నం గల్లీల్లో ఆడిన నితీష్ రెడ్డి ఇప్పుడు అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదగడం తెలుగోళ్ళు సంబరపడే విషయం. నితీష్ ఆట చూసినవారు భవిష్యత్ లో స్టార్ క్రికెటర్ అవుతాడని అంటుంటారు. తన ఇంతటి గుర్తింపుఇచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు ఈసారి ఎలాగైన ఐపిఎల్ ట్రోఫీ అందించాలనే పట్టుదలతో నితీష్ ఉన్నాడు. 
 

33
Indian Premier League 2025

Indian Premier League 2025

నితీష్ రెడ్డి ఐపిఎల్ కెరీర్ : 

మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి తెలుగు టీం సన్ రైజర్స్ హైదరాబాద్ లో కీలక ఆటగాడిగా మారాడు. గత ఐపిఎల్ లో అద్భుత ప్రదర్శనతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు నితీష్. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అతడు విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.  దీంతో అతడి ఈసారి వేలంలోకి వదిలిపెట్టకుండా భారీ మొత్తం చెల్లించి రిటైన్ చేసుకుంది సన్ రైజర్స్ టీం. 

గతేడాది ఐపిఎల్ లో ఆరంగేంట్రం చేసిన నితీష్ కుమార్ 13 మ్యాచులాడి 303 పరుగులు చేసాడు. ఇందులో 21 ఫోర్లు 15 సిక్సర్లు ఉన్నాయి.  ఐపిఎల్ లో అతడి హయ్యెస్ట్ స్కోర్ 76 నాటౌట్. ఇలా ఇతడి ఐపిఎల్ కెరీర్ లో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆల్ రౌండర్ అయినప్పటికీ బౌలింగ్ లో పెద్దగా ప్రభావం చూపించలేదు...  గత సీజన్ లో కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved