MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Team India Captain : సూర్యకుమార్ యాదవ్ ఔట్..? టీమిండియా తర్వాతి కెప్టెన్ ఎవరో తెలుసా..?

Team India Captain : సూర్యకుమార్ యాదవ్ ఔట్..? టీమిండియా తర్వాతి కెప్టెన్ ఎవరో తెలుసా..?

భారత్‌కు T20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. అతని వయసు, ఫామ్ దృష్ట్యా T20 ఫార్మాట్‌ కెప్టెన్సీ నుండి తప్పించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి టీమిండియాా కొత్త కెప్టెన్ ఎవరు? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 16 2026, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సూర్యకుమార్ స్థానంలో వచ్చేది ఎవరు..?
Image Credit : Getty

సూర్యకుమార్ స్థానంలో వచ్చేది ఎవరు..?

టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ అతడు… అలాంటి ఆటగాడినే బిసిసిఐ పక్కనబెట్టే ఆలోచనలో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఐసిసి టీ20 వరల్డ్ కప్ తో పాటు ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లోనూ టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పరుగులు సాధించడంలో విఫలం అవుతున్నాడు. ఇలా ఫామ్ కోల్పోయిన అతడి నుండి టీ20 ఫార్మాట్ పగ్గాలు లాగేసి మరొకరికి అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

2028 లో జరగబోయే టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా ఇప్పటినుంచే సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో సూర్య విషయంలో కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనేది క్రీడా వర్గాల్లో జరుగుతున్న చర్చ. కాబట్టి సూర్యకుమార్ స్థానాన్ని భర్తీ చేయగల, భవిష్యత్ T20 కెప్టెన్సీ రేసులో ఉండే అవకాశాలున్న ఐదుగురు ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.

26
1. శ్రేయస్ అయ్యర్
Image Credit : Getty

1. శ్రేయస్ అయ్యర్

భారత T20 జట్టులో శ్రేయస్ అయ్యర్ కు స్థిరమైన స్థానం లేదు… ఇలా జట్టులోకి వచ్చి అలా వెళ్లిపోతుంటాడు. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మాత్రం అద్భుతమైన కెప్టెన్సీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏకంగా మూడు జట్లను ఐపీఎల్ ఫైనల్స్‌కు చేర్చిన ఏకైక కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ రికార్డు సృష్టించాడు.  ఒకసారి కెప్టెన్‌గా ఐపీఎల్ ట్రోఫీని కూడా గెలుచుకున్నాడు. ఈసారి ఐపీఎల్‌లో రాణిస్తే మాత్రం అయ్యర్ కు భారత T20 జట్టులో సుస్థిర స్థానం దక్కడమే కాదు కెప్టెన్‌గానూ ఛాన్స్ దక్కొచ్చు. 

Related Articles

Related image1
Suryakumar Yadav : సారీ చెప్పిన సూర్యకుమార్ యాదవ్.. అసలేం జరిగిందంటే?
Related image2
Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ నెట్ వర్త్ ఎంతో తెలుసా?
36
2. సంజూ శాంసన్
Image Credit : X

2. సంజూ శాంసన్

2026 టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ ఐపిఎల్ లోనూ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న అతడు ఇప్పటికే ఓ సెంచరీతో అదరగొట్టాడు… ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు. అంతేకాదు గత ఐపీఎల్‌ సీజన్స్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. ఈ ఐపీఎల్‌లో సంజూ శాంసన్ ఫామ్ కొనసాగితే టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులో నిలవడం ఖాయం. 

46
3. హార్దిక్ పాండ్యా
Image Credit : BCCI\Twitter

3. హార్దిక్ పాండ్యా

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు 2024 T20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు వైస్-కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్, భారత T20 కెప్టెన్సీ రేసులో ముందున్నాడు.

56
4. అక్షర్ పటేల్
Image Credit : Getty

4. అక్షర్ పటేల్

స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 2026 ఐసీసీ T20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత జట్టుకు వైస్-కెప్టెన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్‌తో ఆదుకోగల సత్తా ఉన్న ఈ అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్‌కు భారత T20 జట్టు కెప్టెన్ అయ్యే అదృష్టం వరించినా ఆశ్చర్యం లేదు.

66
5. శుభ్‌మన్ గిల్
Image Credit : BCCI

5. శుభ్‌మన్ గిల్

భారత టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్, రాబోయే రోజుల్లో భారత T20 జట్టుకు కెప్టెన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం గిల్ భారత T20 జట్టులో భాగం కానప్పటికీ, ఈసారి ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తే మాత్రం ఈ ఫార్మాట్ పగ్గాలు కూడా దక్కవచ్చు. భారత T20 కెప్టెన్సీ బాధ్యత కూడా గిల్ కు అప్పగించాలనే వాదన ఉంది… మూడు ఫార్మాట్స్ కి ఒకే కెప్టెన్ ను కొనసాగించాలని కొందరు అభిమానులు కోరుతున్నారు. ఈ డిమాండ్స్ ని బిసిసిఐ పరిగణలోకి తీసుకుంటే గిల్ టీ20 కెప్టెన్ కావడం ఖాయం. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Virat Kohli : ఏమైనా తగ్గేదేలే.. కింగ్ కోహ్లీకి ఏమైంది? షాకింగ్ నిజాలు !
Recommended image2
బౌలర్లు దండం పెట్టాల్సిందే ! 6 సార్లు 300+ పరుగులు.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
Recommended image3
IPL : కోహ్లీ కాదు.. చిన్నస్వామికి కొత్త కింగ్ వచ్చేశాడు..!
Related Stories
Recommended image1
Suryakumar Yadav : సారీ చెప్పిన సూర్యకుమార్ యాదవ్.. అసలేం జరిగిందంటే?
Recommended image2
Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ నెట్ వర్త్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved