కంటతడిపెడుతూ రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్ !
Neil Wagner: నీల్ వాగ్నర్ 2012లో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. 2021లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టీమ్ లో సభ్యుడిగా ఉన్న అతను టీ20, వన్డే క్రికెట్ ఆడకుండానే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు ఈ స్టార్ బౌలర్ వాగ్నర్.
Neil Wagner, Wagner,
New Zealand Black Cap Neil Wagner: జట్టులో చోటు దక్కకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ నీల్ వాగ్నర్. కన్నీరు పెట్టుకుంటూ తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు పేర్కొన్నాడు. మూడు టీ20లు, టెస్టు సిరీస్ ల కోసం ఆస్ట్రేలియా ప్రస్తుతం న్యూజిలాండ్ లో పర్యటిస్తోంది. తొలి టీ20 సిరీస్ ను ఆస్ట్రేలియా 3-0తో కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ జరగనుంది.
Neil Wagner
అయితే, ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్ కు న్యూజిలాండ్ జట్టుకు ఎంపిక చేయడం లేదని కీవీస్ క్రికెట్ బోర్డు నీల్ వాగ్నర్ కు సమాచారం అందించింది. దీంతో కలత చెందిన నీల్ వాగ్నర్ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
Neil Wagner
ఈ ప్రకటన సందర్భంగా కన్నీరు పెట్టుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీటితో క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. బౌన్సర్లు బౌలింగ్ చేసి బ్యాట్స్ మన్ ను బెంబేలెత్తించగల ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్.. న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్ గా నిలిచాడు.
Neil Wagner
37 ఏళ్ల వాగ్నర్ న్యూజిలాండ్ తరఫున 64 టెస్టులు ఆడాడు. 52.7 స్ట్రైక్ రేట్ తో 27.57 సగటుతో 260 వికెట్లు పడగొట్టాడు. "బ్లాక్ క్యాప్స్ కోసం టెస్ట్ క్రికెట్ ఆడిన ప్రతి ఒక్క క్షణాన్ని నేను ఆస్వాదించాను. మేము జట్టుగా సాధించగలిగిన ప్రతిదానికీ గర్వపడుతున్నాము. నేను ఈ శిబిరంలో చివరి వారం కోసం ఎదురుచూస్తున్నాను. జట్టుకోసం తాను చేయాల్సింది చేస్తాను.. సభ్యులకు అండగా ఉంటానంటూ పేర్కొన్నాడు.
నీల్ వాగ్నర్ 2012లో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. 2021లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టీమ్ లో సభ్యుడిగా ఉన్న అతను టీ20, వన్డే క్రికెట్ ఆడకుండానే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు ఈ స్టార్ బౌలర్ వాగ్నర్.
ఒక ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసుకోవడం నీల్ వాగ్నర్ అత్యుత్తమ ప్రదర్శన. 2017లో ఒకే ఇన్నింగ్స్‌లో 39 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు నీల్ వాగ్నర్. ఈ టెస్టు మ్యాచ్ వెల్లింగ్టన్‌లో జరిగింది.