- Home
- Sports
- Cricket
- Ind Vs SA: రెండు చెత్త రికార్డులు నమోదు చేసిన నయా వాల్.. వరుసగా 2 టెస్టుల్లోనూ అతడి చేతిలోనే గోల్డెన్ డక్
Ind Vs SA: రెండు చెత్త రికార్డులు నమోదు చేసిన నయా వాల్.. వరుసగా 2 టెస్టుల్లోనూ అతడి చేతిలోనే గోల్డెన్ డక్
Cheteshwar Pujara: వరుస ఇన్నింగ్సులలో విఫలమవుతున్న టీమిండియా నయా వాల్ పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ సంగతి అటుంచితే పుజారా.. తాను కోరుకోని రెండు చెత్త రికార్డులలో భాగమయ్యాడు.

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తర్వాత ‘నయా వాల్’ గా గుర్తింపు పొందిన ఛతేశ్వర్ పుజారా వరుస ఇన్నింగ్సులలో విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు. ఒకప్పుడు భారత జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ‘అడ్డుగోడ’గా నిలిచిన ఆటగాడు ఇప్పుడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు.
తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో కూడా పుజారా గోల్డెన్ డక్ తో ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. దీంతో పుజారా.. తాను కోరుకోని రెండు చెత్త రికార్డులను నమోదు చేశాడు.
భారత జట్టు తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్ గా పుజారా చెత్త రికార్డు సృష్టించాడు. టెస్టులలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అతడు 9 సార్లు డకౌట్ అయ్యాడు.
గతంలో ఈ రికార్డు భారత మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్సర్కార్ పేరిట ఉండేది. 3వ స్థానంలో ఆడుతూ అతడు 8 సార్లు డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ (7 డకౌట్లు), మోహిందర్ అమర్నాథ్ (6 డకౌట్లు), అజిత్ వాడేకర్ (5) ఉన్నారు.
ఇక దీంతో పాటు..వరుసగా రెండు సార్లు ఒకే బౌలర్ చేతిలో పుజారా గోల్డెన్ డకౌట్ గా వెనుదిరగడం గమనార్హం. సెంచూరియన్ లో జరుగుతున్న తొలి టెస్టులో పుజారా ను ఎంగిడి ఔట్ చేసిన విషయం తెలిసిందే.
2018లో కూడా పుజారా ఇదే వేదికపై జరిగిన రెండో ఇన్నింగ్సులో ఎంగిడి చేతిలోనే రనౌట్ అయ్యాడు. ఇదిలాఉండగా పుజారా ప్రదర్శనపై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు వరుస పెట్టి సెంచరీలు బాదిన పుజారా దాదాపు రెండున్నరేండ్లు అయినా శతకం చేయడంలేదు. ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్ పర్యటనలో అయినా అతడు ఆ లోటును పూడ్చుతాడనుకుంటే అక్కడా విఫలమయ్యాడు. ఇక తాజాగా దక్షిణాఫ్రికాలో కూడా తొలి ఇన్నింగ్సులో సున్నా పరుగులకే నిష్క్రమించడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఒకవేళ పుజారా మరో రెండు, మూడు ఇన్నింగ్సులలో ఇదే ప్రదర్శన చేస్తే ఇక జట్టులో చోటు దక్కడం కూడా అనుమానమే అనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. అతడితో పాటు రహానే కు కూడా ఇదే ఆఖరు సిరీస్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు సీనియర్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.