- Home
- Sports
- Cricket
- అంతా ఆ బాబా మహిమే! విరాట్ కోహ్లీ వరుస సెంచరీలతో నీమ్ కరోలీ బాబా ఆశ్రమానికి పోటెత్తిన జనం...
అంతా ఆ బాబా మహిమే! విరాట్ కోహ్లీ వరుస సెంచరీలతో నీమ్ కరోలీ బాబా ఆశ్రమానికి పోటెత్తిన జనం...
క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ క్రేజ్‌ని అందుకునే ప్లేయర్ మరెవ్వరూ లేరు. ఒక్క ఇన్‌స్టా పోస్టు ద్వారా కోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకుంటున్న విరాట్ కోహ్లీ, మూడేళ్ల బ్రేక్ తర్వాత సెంచరీల మోత మోగిస్తున్నాడు... అయితే విరాట్ సెంచరీల క్రెడిట్ ఓ బాబాకి దక్కింది...

Image credit: PTI
ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్‌పై టీ20 సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ, మూడు నెలల విరామం తర్వాత బంగ్లాదేశ్ టూర్‌లో వన్డే శతకం బాదాడు. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ, గత ఏడాదిని సెంచరీతో ముగించాడు...
Image credit: PTI
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, కెరీర్‌లో 45వ వన్డే సెంచరీని అందుకున్నాడు. రెండో వన్డేలో సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటైన విరాట్ కోహ్లీ, మూడో వన్డేలో దుమ్మురేపాడు. మూడో వన్డేలో 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 166 పరుగులు చేశాడు...
మూడేళ్ల విరామం తర్వాత విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాది బీభత్సమైన ఫామ్‌ని అందుకోవడంతో నీమ్ కరోలీ బాబా గురించి సోషల్ మీడియాలో బీభత్సమైన చర్చ నడుస్తోంది. దీనికి కారణంగా గత నవంబర్‌లో విరాట్ కోహ్లీ కుటుంబంతో సహా నీమ్ కరోలీ బాబా ఆశ్రమానికి వెళ్లాడు...
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, వామిక కోహ్లీ కలిసి ఉత్తరాఖండ్‌లోని నైనితల్‌లోని కాంచీ ధామ్‌లో ఉన్న నీమ్ కరోలీ బాబా ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడే చాలాసేపు బాబా సేవలో గడిపారు. బాబా ఆశ్రమంలో ఉన్న కోహ్లీ దంపతులున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
బాబాను దర్శించుకున్న తర్వాత విరాట్ కోహ్లీ బీభత్సమైన ఫామ్‌ని అందుకుని నాలుగు మ్యాచుల్లో మూడు సెంచరీలు బాదేశాడు. దీంతో అంతా బాబా మహత్యమేనని కోహ్లీ అభిమానులు, నీమ్ కరోలీ బాబా ఆశ్రమానికి క్యూ కడుతున్నారు... ఒక్కసారిగా ఈ బాబా ఆశ్రమానికి వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యిందట..
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలతో పాటు యాపెల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్, ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్‌తో పాటు హాలీవుడ్ నటి జూలియా రొబర్ట్స్ వంటి ప్రముఖులు ఎందరో నీమ్ కరోలీ బాబాకి భక్తులు కావడం కొసమెరుపు..