- Home
- Sports
- Cricket
- ఒంటికాలితో కుంటుతూ బ్యాటింగ్‌కి వచ్చిన నాథన్ లియాన్... ట్రెండింగ్‌లో జస్ప్రిత్ బుమ్రా...
ఒంటికాలితో కుంటుతూ బ్యాటింగ్‌కి వచ్చిన నాథన్ లియాన్... ట్రెండింగ్‌లో జస్ప్రిత్ బుమ్రా...
2021 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా, టీమిండియాని ఓడించి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కూడా గెలిచింది. ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో కూడా ఆస్ట్రేలియా వన్ ఆఫ్ ది ఫెవరెట్. ఆసీస్ ఆధిపత్యానికి కారణం ఐపీఎల్‌లో, బీబీఎల్లో కాదు.. వారి డెడికేషనే..

Nathan Lyon
యాషెస్ సిరీస్ 2023 టోర్నీలో భాగంగా జరుగుతున్న లార్డ్స్ టెస్టులో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ తీవ్రంగా గాయపడ్డాడు. మోకాలి గాయంతో సరిగ్గా నడవలేక, ఊత కర్రల సాయంతో స్టేడియానికి వచ్చాడు.
తొలి ఇన్నింగ్స్‌లో నాథన్ లియాన్ గాయపడడంతో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా టాడ్ ముర్ఫీని తుది జట్టులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా మాత్రం అందుకు ప్రయత్నించలేదు. గాయపడినా కూడా నాథన్ లియాన్‌నే కొనసాగించింది...
రెండో ఇన్నింగ్స్‌లో ఆఖరి వికెట్‌గా క్రీజులోకి వచ్చిన నాథన్ లియాన్, 13 బంతులు ఫేస్ చేశాడు. ఇందులో మూడు బౌన్సర్లు, లియాన్ శరీరానికి తగిలాయి. అసలే మోకాలి నొప్పితో సరిగ్గా నిలబడలేక ఇబ్బంది పడుతున్న నాథన్ లియాన్, ఈసారి బౌన్సర్ల ధాటికి మరింత ఇబ్బంది పడ్డాడు..
Nathan Lyon
అయినా పట్టు వదలకుండా 13 బంతులు ఫేస్ చేసిన నాథన్ లియాన్ ఓ బౌండరీ బాది స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కంకూషన్ సబ్‌స్టిట్యూట్ గురించి కేవిన్ పీటర్సన్, ఆస్ట్రేలియాని ప్రశ్నించాడు..
‘నాథన్ లియాన్‌ని బ్యాటింగ్‌కి పంపే బదులుగా కంకూషన్ సబ్‌స్టిట్యూట్ వాడి ముర్ఫీని తీసుకోవచ్చుగా. వాళ్లు ఇలా ఆడి ఏం నిరూపించాలని అనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు..’ అంటూ వ్యాఖ్యానించాడు నాథన్ లియాన్.
Nathan Lyon
దీనిపై నాథన్ లియాన్ స్పందించాడు. ‘నా ఫ్రెండ్ ఒకడు తలకు బౌన్సర్ తాకి ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి నా ప్లేస్‌లో మరో ప్లేయర్ ప్రాణాన్ని రిస్క్ చేయడానికి పంపించడానికి నేనెప్పుడూ ఒప్పుకోను.. ’ అంటూ కామెంట్ చేశాడు నాథన్ లియాన్..
Jasprit Bumrah
ఈ వ్యాఖ్యలతో జస్ప్రిత్ బుమ్రా పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. దీనికి కారణం ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు టీమ్‌కి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడో ఇప్పటిదాకా క్లారిటీ లేదు..
Jasprit Bumrah
జస్ప్రిత్ బుమ్రా మాత్రమే కాదు, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ వంటి ప్లేయర్లు గాయాలతో టీమ్‌కి కొన్ని నెలలుగా దూరంగా ఉన్నారు. గత ఏడాది రోహిత్ శర్మ ఆడిన మ్యాచుల కంటే రెస్ట్ తీసుకున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ..
Rohit Sharma
అందుకే ఆస్ట్రేలియా టీమ్ డెడికేషన్ ముందు మనవాళ్లు నిలవలేరని, చిన్న దెబ్బ తగిలితే రెండు మూడు నెలలు టీమ్‌కి దూరంగా ఉండే ప్లేయర్లతో వన్డే వరల్డ్ కప్, ఐసీసీ టోర్నీలు గెలవాలని అనుకోవడం మూర్ఖత్వం అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.. ఐపీఎల్ కోసం ఐసీసీ టోర్నీలను కూడా లెక్కచేయని మనవాళ్లు ఎక్కడా, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం ఐపీఎల్ వేలంలో కూడా పాల్గొనని ఆస్ట్రేలియా ప్లేయర్లు ఎక్కడా? అంటూ మనవాళ్ల డెడికేషన్‌ని ప్రశ్నిస్తున్నారు..