MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సచిన్, విరాట్ కాదు.. నా ఫేవరేట్ క్రికెటర్ అతడే.. : హార్ధిక్ పాండ్యా

సచిన్, విరాట్ కాదు.. నా ఫేవరేట్ క్రికెటర్ అతడే.. : హార్ధిక్ పాండ్యా

Hardik Pandya: కెప్టెన్ గా తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన జట్టుకు ట్రోఫీని అందించిన గుజరాత్ టైటాన్స్ సారథి హార్ధిక్ పాండ్యా తాజాగా తన ఫేవరేట్ క్రికెటర్ ఎవరో వెల్లడించాడు. 

2 Min read
Author : Srinivas M
Published : Jun 07 2022, 04:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సాధారణంగా  నైంటీస్ కిడ్స్ కు ఫేవరేట్ క్రికెటర్ ఎవరంటే టక్కున గుర్తుకొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. అంతర్జాతీయంగా చూస్తే అదే కాలంలో ఓ వెలుగు వెలిగిన బ్రియాన్ లారా, జాక్వస్ కలిస్,  స్టీవ్ వా వంటి ఆటగాళ్ల పేర్లు చెబుతారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కానీ టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తన పేవరేట్ క్రికెటర్ పైన పేర్కొన్న వాళ్లెవరూ కాదంటున్నాడు. ఆధునిక కాలంలో గొప్ప క్రికెటర్లుగా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్, ధోని, విరాట్ కోహ్లి వంటి వాళ్లు కూడా కాదంటున్నాడు. 

38

పాండ్యాకు భాగా నచ్చిన ఆటగాడు టీమిండియా మాజీ ఓపెనర్, విదర్భ క్రికెటర్  వసీం జాఫర్. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు.  

48

హార్ధిక్ మాట్లాడుతూ.. ‘నాకు కూడా జాక్వస్ కలిస్, సచిన్, విరాట్ ల ఆటంటే చాలా ఇష్టం.  వీళ్లే గాక చాలా మంది దిగ్గజాల ఆటను నేను ఇష్టపడతాను. కానీ నా ఫేవరేట్ క్రికెటర్ మాత్రం  వసీం జాఫర్.

58

జాఫర్ బ్యాటింగ్ చేస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. జాఫర్ లెజెండరీ క్రికెటర్.  పలు సందర్భాల్లో నేను కూడా జాఫర్ బ్యాటింగ్ స్టైల్ ను కాపీ కొడదామనుకున్నా. కానీ నేను అతడి క్లాస్ ను అందుకోలేకపోయా...’ అని తెలిపాడు.  
 

68

భారత్ తరఫున 31 టెస్టులు ఆడిన జాఫర్.. 1,944 పరుగులు చేశాడు. అప్పటికే భారత జట్టులో  సచిన్, సెహ్వాగ్, లక్ష్మణ్, ద్రావిడ్, గంగూలీ వంటి దిగ్గజాలు ఉండటంతో  జాఫర్ కు జాతీయ జట్టులో పెద్దగా అవకాశాలు రాలేదు.

78

అయినా తనకు వచ్చిన అవకాశాలను జాఫర్  సద్వినియోగం  చేసుకున్నాడు. తాను ఆడిన 31 టెస్టులలో 11 హాఫ్ సెంచరీలు, ఐదు సెంచరీలు సాధించాడు.  అత్యధిక స్కోరు 212 గా ఉంది. 

88

జాతీయ జట్టులో  జాఫర్ కు అంతగా గుర్తింపు దక్కకపోయినా దేశవాళీలో మాత్రం  జాఫర్  టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు. 260 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో ఏకంగా 19,410 పరుగులు చేశాడు. ఇందులో 57 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలున్నాయి. రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా ఘనత సాధించాడు. 

About the Author

SM
Srinivas M
Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image2
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Recommended image3
IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved