ధోనీ ఇక చాలు, రెస్ట్ తీసుకో... అప్పుడే సీఎస్‌కేకి మంచిది... బ్రియాన్ లారా షాకింగ్ కామెంట్...

First Published Apr 21, 2021, 3:51 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన ఇస్తోంది. మొదటి మ్యాచ్‌లో ఓడినా, ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లో మంచి విజయాలు అందుకున్న సీఎస్‌కే, మిగిలిన జట్లకంటే మెరుగైన రన్‌రేటు నమోదుచేసింది.