- Home
- Sports
- Cricket
- ధోనీ కెప్టెన్సీ గురించి ఏదేదో ఊహించుకున్నా కానీ... ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ కామెంట్స్...
ధోనీ కెప్టెన్సీ గురించి ఏదేదో ఊహించుకున్నా కానీ... ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ కామెంట్స్...
ఐపీఎల్ 2021 సీజన్‌లో కేవలం 2 పరుగుల తేడాతో ఆరెంజ్ క్యాప్ కోల్పోయాడు ఫాఫ్ డుప్లిసిస్. యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి పోటాపోటీన పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, ఈ సీజన్‌లో ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించబతున్నాడు...

ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఫాఫ్ డు ప్లిసిస్‌ను రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో దక్షిణాఫ్రికా జట్టుకి కెప్టెన్సీ చేసిన డుప్లిసిస్... ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...
గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ వంటి సీనియర్లు జట్టులో ఉన్నప్పటికీ, గత సీజన్‌లో సీఎస్‌కేలో కీలక సభ్యుడిగా ఉన్న ఫాఫ్ డుప్లిసిస్‌కే కెప్టెన్సీ అప్పగించింది ఆర్‌సీబీ...
‘చిత్రమైన విషయం ఏంటంటే... చెన్నై సూపర్ కింగ్స్‌కి ఎంపికైనప్పుడు ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ గురించి చాలా ఊహించుకున్నా. హెడ్ మాస్టర్‌లా అలా చేయాలి, ఇలా ఉండాలి అని రూల్స్ పెడతాడని అనుకున్నా...
అయితే ఎమ్మెస్ ధోనీ అందుకు పూర్తిగా విరుద్ధం. నేను సౌతాఫ్రికా ప్లేయర్‌ని కావడం వల్ల నేను అలా అనుకున్నానేమో... ఇక్కడి వాతావరణం పూర్తిగా డిఫరెంట్...
సీఎస్‌కేకి మొదటిసారి ఆడినప్పుడు అదే అనుకున్నా, ఎమ్మెస్ ధోనీ నేను అనుకున్నట్టు కాదని! ఎమ్మెస్ ధోనీ, తన టీమ్ మెంబర్స్‌కి ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వడు. ఇది చెయ్, అది చెయ్ అని చెప్పడు...
ప్రతీ ఒక్కరికీ సెపరేట్ స్టైల్ ఉండడం చాలా అవసరం. ఎందుకంటే విరాట్ కోహ్లీలా నేను ఆడలేను, ఎందుకంటే నేను విరాట్ కోహ్లీని కాదు. అలాగే ఎమ్మెస్ ధోనీలా ఉండలేను...
నేనేంటే తెలుసుకుని, నాలా ఉంటే చాలు. ఒత్తిడిని ఎదుర్కోవడానికి కావాల్సిన మనోధైర్యం అదే ఇస్తుంది. ఎమ్మెస్ ధోనీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా...
ఓ లీడర్‌గా, ఎంతో పరిణతితో ఆలోచించడానికి సీఎస్‌కేతో ఆడిన అనుభవం ఉపయోగపడుతుంది. చెన్నై సూపర్ కింగ్స్‌లో నా ప్రయాణం చాలా గొప్పగా సాగింది...’ అంటూ చెప్పుకొచ్చాడు ఫాఫ్ డుప్లిసిస్...