ధోనీ, సీఎస్‌కే గెలవాలంటే ముందు ఆ పని చేయ్... సునీల్ గవాస్కర్ కామెంట్...
యువ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది చెన్నై సూపర్ కింగ్స్... చెన్నై బౌలర్లను చితకబాదిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ పృథ్వీషా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్... 188 పరుగుల భారీ టార్గెట్‌ను తేలిగ్గా చేధించేశారు... చెన్నైని గెలిపించాలంటే ధోనీయే ముందుండి నడిపించాలని కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...
- FB
- TW
- Linkdin
- GNFollow Us

‘మహేంద్ర సింగ్ ధోనీ, ఇన్నాళ్లు చెన్నై సూపర్ కింగ్స్‌కి ఎన్నో విజయాలు అందించాడు. అయితే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి వేరు... సీఎస్‌కేకి ధోనీ అవసరం చాలా ఉంది...

ధోనీ ఇకనైనా బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి వచ్చి ఎక్కువ బంతులు ఎదుర్కోవాలి.. బ్యాటింగ్ ఆర్డర్‌లో చాలా ఆలస్యంగా వస్తున్న ధోనీ, మహా అయితే ఆఖరి నాలుగైదు ఓవర్లు మాత్రమే ఆడాలని చూస్తున్నాడు.

ఎంతో అనుభవం ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ ఇలా చేయడం ఏ మాత్రం మంచిది కాదు. సీనియర్ బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా ఉన్న ధోనీ, జట్టులో ఉన్న యువ ఆటగాళ్లను ముందుండి నడిపించడానికి సిద్ధంగా ఉండాలి...

ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉన్న ప్లేయర్లలో కొందరు ప్లేయర్లు చాలా చిన్నవాళ్లు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టిన సామ్ కుర్రాన్‌కి కూడా ఎక్కువగా అంతర్జాతీయ అనుభవం లేదు...

మొదటి మ్యాచ్‌లో అనుభవం దృష్ట్యా సామ్ కుర్రాన్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి తీసుకురావాలని చెన్నై భావించొచ్చు. కానీ యూఏఈలో జరిగిన సీజన్‌లో సామ్ కుర్రాన్ ఓపెనర్‌గా కూడా వచ్చి విఫలమయ్యాడు...

మొదటి మ్యాచ్‌లో ధోనీ, తాను ఆడిన రెండో బంతికే అవుట్ అయ్యాడు. కానీ అందరికీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. టోర్నీలో సీఎస్‌కే విజయాలతో ముందుకెళ్లాలి అంటే ధోనీ కూడా ముందుకు వెళ్లాలి...

ఐదో స్థానంలో లేదా ఆరో స్థానంలో అయినా ధోనీ బ్యాటింగ్‌కి వస్తే బాగుంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న మొట్టమొదటి మ్యాచ్‌లోనే ఎంతో అనుభవం ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయాన్ని అందుకున్నాడు రిషబ్ పంత్...

188 పరుగుల లక్ష్యచేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు పృథ్వీషా 72, శిఖర్ ధావన్ 85 పరుగులతో రాణించగా... రిషబ్ పంత్ మ్యాచ్‌ను ముగించాడు.

గత సీజన్‌లో రెండు మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇది వరుసగా మూడో ఓటమి... ఢిల్లీ క్యాపిటల్స్ బలంగా మారిందా? లేక చెన్నై సూపర్ కింగ్స్ బలహీనంగా మారిందో తెలియక ఆయోమయానికి గురవుతున్నారు అభిమానులు.