MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆ సీరియల్ చూసి కూతురికి పేరు పెట్టిన ధోనీ... ఇంకా చిన్న పేరు పెట్టేందుకు వెతికినా...

ఆ సీరియల్ చూసి కూతురికి పేరు పెట్టిన ధోనీ... ఇంకా చిన్న పేరు పెట్టేందుకు వెతికినా...

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మాస్‌లో బీభత్సమైన క్రేజ్ ఉంది. మాస్ ఫాలోయింగ్ విషయంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కూడా ధోనీ క్రేజ్‌ని అందుకోలేరు. ధోనీ కూతురు జీవాకి కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది... 

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Feb 06 2023, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ziva dhoni messi

ziva dhoni messi

టీమిండియా కెప్టెన్‌గా మారడానికి ముందు దీపికా పదుకొనే, లక్ష్మీ రాయ్ వంటి హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించిన మహేంద్ర సింగ్ ధోనీ, 2010లో సాక్షి రావత్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ధోనీ ‘బయోపిక్’ మూవీలో చూపించినట్టుగా వీరిద్దరి పరిచయం ఫ్లైయిట్‌లో జరగలేదు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఓ స్నేహితుడితో కలిసి పార్టీకి వెళ్లిన మహేంద్ర సింగ్ ధోనీ, అక్కడ సాక్షి రావత్‌ని చూశాడట. అలా ఏర్పడిన పరిచయం, ఫోన్లు నెంబర్లు మార్చుకునే స్నేహంగా మారి.. ప్రేమకి దారి తీసి, పెళ్లి దాకా వెళ్లింది. 13 ఏళ్లుగా వీరి వివాహ జీవితం సజావుగా సాగిపోతోంది..

38

2015ఫిబ్రవరి 6న ధోనీ, సాక్షి దంపతులకు జీవా జన్మించింది. అయితే కూతురికి జీవా అనే పేరు పెట్టడానికి గల కారణం ఏంటనేది చాలామందికి తెలీదు. వాస్తవానికి ఈ పేరును ఓ సీరియల్ చూసి పెట్టాడట మాహీ...

48

‘నాకు పెద్ద పెద్ద పేర్లు గుర్తుండవు. NCIS అనే టీవీ సీరియల్‌లో జీవా అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్, సాక్షికి బాగా ఇష్టం. ఆ పేరు నాకు భలే క్యూట్‌గా అనిపించింది. అందుకే ఆ పేరు పెట్టాం. అంతకంటే చిన్న పేరు పెడదామని వెతికా, దానికి ఇదే బాగుంటుందని అలా ఫిక్స్ అయ్యాం...’ అంటూ చెప్పుకొచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ...
 

58
Image credit: Ziva/Instagram

Image credit: Ziva/Instagram

7 ఏళ్ల జీవా సింగ్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా అకౌంట్ కూడా ఉంది. సాక్షి సింగ్ రావత్, కూతురి అకౌంట్‌ని మ్యానేజ్ చేస్తుంటుంది. ప్రస్తుతం జీవా సింగ్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు...

68

ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, జీవా కోసం ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని ప్రత్యేకంగా పంపించాడు. సీఎస్‌కే మేనేజ్‌మెంట్, ఎంతో కష్టపడి, ఈ ఆటోగ్రాఫ్‌ని సాధించింది. ఈ జెర్సీని ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది..

78

టీమిండియాలో ఎంతో డీసెంట్‌గా ఉండే మహేంద్ర సింగ్ ధోనీ, కూతురికి కలిసి తెగ అల్లరి చేస్తుంటాడు. ధోనీ, జీవా అల్లరిని ఫోటోల్లో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది సాక్షి సింగ్ ధోనీ.. 

88

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడే ప్రతీ మ్యాచ్‌కి కూతురితో కలిసి వస్తుంటుంది సాక్షి. ఐపీఎల్ 2023 సీజన్, ధోనీకి ఆఖరిది అని ప్రచారం జరుగుతోంది. 2024 నుంచి ధోనీ, సీఎస్‌కేకి మెంటర్‌గా ఉండొచ్చు.. 

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
రెచ్చిపోయిన యువ ఆటగాళ్లు.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా
Recommended image2
Zimbabwe vs India: మరోసారి మెరిసిన వైభ‌వ్‌.. కొద్దిలో సెంచ‌రీ మిస్, టీమిండియా స్కోర్ ఎంతంటే
Recommended image3
Team India: హరారేలో టీమిండియా రచ్చ రంబోలా.. ఇంగ్లాండ్ కు షాక్.. మళ్లీ టీ20ల్లో నంబర్ 1
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved