AB de Villiers: ఏబీ డివిలియర్స్ ప్రపంచకప్ జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లు.. ఎవరంటే..?
Mr 360 AB de Villiers: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 రసవత్తరంగా సాగి ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా మాజీ బ్యాటింగ్ దిగ్గజం, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ తన క్రికెట్ ప్రపంచ కప్ 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్'ను ప్రకటించాడు. వీరిలో ఐదుగురు భారత ఆటగాళ్లు, ముగ్గురు ఆసీస్ క్రికెటర్స్ ఉన్నారు.
Mr 360 AB de Villiers : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 రసవత్తరంగా సాగి ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా మాజీ బ్యాటింగ్ దిగ్గజం, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ తన క్రికెట్ ప్రపంచ కప్ 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్'ను ప్రకటించాడు.
ఈ ఎలైట్ జట్టు వివిధ జట్లలోని క్రికెట్ దిగ్గజాల అద్భుతమైన ప్రదర్శనల సమాహారానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ నైపుణ్యాన్ని ప్రదర్శించిన క్రీడాకారులు ఉన్నారు. విశేషం ఏమిటంటే, ఈ లైనప్ ప్రధానంగా వైవిధ్యమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.
దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ తన ప్రపంచకప్ జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లకు చోటుకల్పించాడు. 11 మంది సభ్యులతో కూడిన జట్టులో భారత క్రికెటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజాలకు చోటు కల్పించాడు.
అయితే, ఐసీసీ ఎంపిక చేసిన ప్రపంచ కప్ జట్టులో చోటు సంపాదించిన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్‌లకు చోటు దక్కలేదు. కాగా, ఐసీసీ జట్టులో చోటు దక్కని శ్రేయాస్ అయ్యర్ ఏబీ డివిలియర్స్ జట్టులో ఉన్నాడు.
ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ 2023 విజేత ఆస్ట్రేలియా జట్టు నుండి ముగ్గురికి ఏబీ చోటుకల్పించాడు. ఈ జట్టులో ట్రావిస్ హెడ్, సహచరులు గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫైనల్‌లో ఆస్ట్రేలియాను సులభంగా విజయానికి నడిపించిన ఆడమ్ జంపాలు ఉన్నారు.
న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్ర, దక్షిణాఫ్రికాకు చెందిన గెరార్డ్ కోయెట్జీ, శ్రీలంకకు చెందిన దిల్షాన్ మధుశంక ఏబీ డివిలియర్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
Travis Head
ఏబీ డివిలియర్స్ వరల్డ్ కప్ XI క్రికెట్ జట్టు ఇదే.. : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా (భారత్), ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా(ఆస్ట్రేలియా), రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్), గెరార్డ్ కోయెట్జీ (దక్షిణాఫ్రికా), దిల్షాన్ మధుశంక (శ్రీలంక).