MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • స‌చిన్ టెండూల్కర్ రికార్డును స‌మం చేసిన రోహిత్ శ‌ర్మ‌

స‌చిన్ టెండూల్కర్ రికార్డును స‌మం చేసిన రోహిత్ శ‌ర్మ‌

Rohit Sharma, Sachin Tendulkar : వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్ల లిస్టులో రాహుల్ ద్రవిడ్‌ను అధిగమించడానికి రోహిత్ శ‌ర్మ ఒక్క ప‌రుగు దూరంలో ఉన్నాడు. అయితే, శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచ‌రీ కొట్టిన హిట్ మ్యాన్ లెజెండ‌రీ ప్లేయ‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును స‌మం చేశాడు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 03 2024, 08:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
sachin rohit

sachin rohit

Rohit Sharma, Sachin Tendulkar: భార‌త్-శ్రీలంక తొలి వ‌న్డే మ్యాచ్ టై అయింది కానీ, భారత కెప్టెన్ రోహిత్ శర్మ మ‌రోసారి తన తుఫాను బ్యాటింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. పవర్‌ప్లేలో మరోసారి బౌలర్లపై విధ్వంసం సృష్టిస్తూ 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 భారీ సిక్స‌ర్ల‌తో 58 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
sachin tendulkar rohit sharma

sachin tendulkar rohit sharma

ఈ మ్యంచ్ లో హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ తో  ఓపెనర్‌గా 'గాడ్ ఆఫ్ క్రికెట్'  సచిన్ టెండూల్కర్ రికార్డును హిట్‌మ్యాన్ సమం చేశాడు. అలాగే, అంతర్జాతీయ క్రికెట్‌లో 15,000 పరుగులను కూడా అందుకున్నాడు. 

36
sachin rohit shots

sachin rohit shots

అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా రోహిత్ శర్మ 50కి పైగా పరుగులు చేయడం ఇది 120వ సారి. దీంతో ఒపెన‌ర్ గా అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును రోహిత్ సమం చేశాడు. సచిన్ కూడా ఓపెనర్‌గా తన కెరీర్‌లో 50కి పైగా 120 సార్లు స్కోర్ చేశాడు. ఈ లిస్టులో త‌న‌ కెరీర్‌లో ఒపెన‌ర్ గా 146 సార్లు 50కి పైగా పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ టాప్ లో ఉన్నాడు. 

46

అలాగే, 58 పరుగుల ఈ ఇన్నింగ్స్ తో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 15 వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. ప్రపంచంలో 10వ ఆటగాడిగా, భారతదేశం నుండి దీనిని సాధించిన మూడవ ఆటగాడిగా నిలిచాడు. హిట్‌మ్యాన్ కంటే ముందు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ ఈ ఘనత సాధించారు.

56
Gambhir and Rohit

Gambhir and Rohit

ఓపెనర్‌గా వేగంగా 15 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ తర్వాత రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ 331 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా, హిట్‌మన్ 352 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.

 

66
Rohit Sharma, Rahul Dravid

Rohit Sharma, Rahul Dravid

వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రాహుల్ ద్రవిడ్‌ను అధిగమించడంలో రోహిత్ శర్మ ఒక్క పరుగు తేడాతో ఉన్నాడు. ద్ర‌విడ్ ను అధిగ‌మిస్తే రోహిత్ వన్డే క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచేవాడు. ప్రస్తుతం రోహిత్ 10767 పరుగులతో 5వ స్థానంలో ఉండగా, రాహుల్ ద్రవిడ్ 10768 పరుగులతో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 18426 పరుగులతో మొదటి స్థానంలో, విరాట్ కోహ్లీ (13872) రెండో స్థానంలో, సౌరవ్ గంగూలీ (11221) మూడో స్థానంలో ఉన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
రోహిత్ శర్మ
క్రీడలు
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved