టీమిండియాకి లక్కీ ప్లేయర్‌గా మారిన దీపక్ హుడా...ఒకటి, రెండూ కాదు! ఏకంగా 16 మ్యాచుల్లో...
దీపక్ హుడా.. లేటుగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఆల్‌రౌండర్. గత ఏడాది ఆరంభంలో జరిగిన సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో కృనాల్ పాండ్యాతో గొడవ పడి, బరోడా టీమ్ నుంచి ఏడాది సస్పెన్షన్‌కి గురై వార్తల్లో నిలిచిన దీపక్ హుడా... 2022లో టీమిండియాకి మోస్ట్ లక్కీ ప్లేయర్‌గా మారతారని అతను కూడా ఊహించి ఉండడేమో... దీపక్ హుడా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు భారత జట్టు...
2022 ఫిబ్రవరి 6న వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన దీపక్ హుడా, అదే నెలలో శ్రీలంకతో జరిగిన సిరీస్ ద్వారా టీ20 ఆరంగ్రేటం చేశాడు..
Deepak Hooda- Sanju Samson
ఇప్పటిదాకా దీపక్ హుడా 16 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన దీపక్ హుడా... అన్నింట్లోనూ విజయాలు అందుకున్నాడు. మెన్స్ క్రికెట్ చరిత్రలో ఓ ఆరంగ్రేట ఆటగాడిగా ఇదే రికార్డు... ఇంతకుముందు ఏ ప్లేయర్ కూడా ఆరంగ్రేటంలోనే ఇన్ని విజయాల్లో భాగం కాలేదు...
Sanju Samson-Deepak Hooda
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో సెంచరీ చేసి... భారత జట్టు తరుపున రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ తర్వాత టీ20 సెంచరీ చేసిన మూడో బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన దీపక్ హుడా... 7 వన్డేలు, 9 టీ20 మ్యాచులు ఆడాడు...
Manish Pandey
ఇంతకుముందు భారత జట్టుకి మోస్ట్ లక్కీ ప్లేయర్‌గా ఉండేవాడు మనీశ్ పాండే. మనీశ్ పాండే ఆడిన 19 టీ20 మ్యాచుల్లో భారత జట్టు ఒక్కటి కూడా ఓడిపోలేదు. 17 మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్న టీమిండియా, రెండింటిని సూపర్ ఓవర్‌లో గెలిచింది...
అయితే మనీశ్ పాండే లక్ కేవలం టీ20లకు మాత్రమే పరిమితమైంది. వన్డేల్లో మనీశ్ పాండే ఆడిన మ్యాచుల్లోనూ భారత జట్టును పరాజయం పలకరించింది. దీంతో దీపక్ హుడా టీమిండియాకి మోస్ట్ లక్కీ ప్లేయర్‌గా మారిపోయాడు...
అయితే దీపక్ హుడా ఇప్పటిదాకా అసలు సిసలైన ఛాలెంజ్‌ని ఎదుర్కోలేదు. పటిష్టమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌పై మ్యాచులు ఆడని దీపక్ హుడా, ఇంగ్లాండ్‌తో ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడాడు. వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వేలపై అదరగొడుతున్న దీపక్ హుడా... ఆసియా కప్ 2022 టోర్నీకి ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే... ఈ టోర్నీలో అతని పర్ఫామెన్స్, టీమిండియాకి అతను ఎంత లక్కీయో తేల్చనుంది..