నటరాజన్ ఎంట్రీ... మహమ్మద్ షమీపై ప్రెషర్ పెంచుతోందా...
గత రెండేళ్లుగా అద్భుతంగా రాణిస్తున్నాడు టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ. డెత్ ఓవర్లలో బుమ్రా మ్యాజిక్ చేస్తుంటే, ప్రారంభ ఓవర్లలో షమీ వికెట్లు తీస్తూ టీమిండియాలో కీలక బౌలర్‌గా మారాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో కూడా బుమ్రాతో పోటీ పడి రాణించిన షమీ... ఆ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్‌లో మాత్రం పెద్దగా రాణించలేకపోతున్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో మూడు వికెట్లు తీసిన మహమ్మద్ షమీ... రెండో వన్డేలో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

9 ఓవర్లలో 73 పరుగులిచ్చి ఒకే వికెట్ తీసుకున్నాడు. షమీ కంటే బుమ్రా ఎక్కువ పరుగులు ఇచ్చినా, మూడో వన్డేలో షమీకి చోటు దక్కలేదు.

షమీ ప్లేస్‌లో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన టి నటరాజన్ కీలక దశలో 2 వికెట్లు తీసి అదరగొట్టాడు. ఓపెనింగ్ జోడిని విడగొట్టడంతో పాటు మంచి భాగస్వామ్యం నెలకొల్పిన ఆస్టన్ అగర్‌ను అవుట్ చేశాడు.

నటరాజన్ ప్రదర్శన, భారత జట్టులో సీనియర్ పేసర్‌గా కొనసాగుతున్న మహ్మద్ షమీని ఒత్తిడిలోకి నెట్టేసినట్టు కనిపిస్తోంది...

మొదటి టీ20 మ్యాచ్‌లో జస్ప్రిత్ బుమ్రాకి విశ్రాంతినిచ్చిన టీమిండియా... షమీని మాత్రం ఆడించింది. అయితే మొదటి మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ, ఏకంగా 46 పరుగులు సమర్పించుకున్నాడు.

4 ఓవర్లలో వికెట్ తీయలేకపోయినా సీనియర్ పేసర్‌గా ఉన్న షమీ ఎక్కువ పరుగులు సమర్పించుకోవడం చూస్తుంటే అతను ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తోంది..

అయితే ప్రారంభ ఓవర్లలో వికెట్లు తీయడం షమీ స్పెషాలిటీ. అయితే మొదటి ఓవర్‌ను దీపక్ చాహార్‌తో వేయించిన కోహ్లీ, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్‌తో వేయించాడు. ఓపెనర్లు కుదురుకున్నాక మూడో ఓవర్‌ను షమీతో వేయించాడు.

ఈ కారణంగానే షమీకి వికెట్లు దక్కలేదని విశ్లేషిస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. ఇదే మ్యాచ్‌లో నటరాజన్ 4 ఓవర్లలో 3 వికెట్లు తీసుకున్న విషయం తెలిసిందే...

‘నటరాజన్ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. అయితే నట్టూ పర్ఫామెన్స్, షమీని ఒత్తిడిలో పడేస్తుంది. నటరాజన్ రాణిస్తే షమీ ప్లేస్‌లో జట్టులో స్థిరమైన స్థానం సంపాదించుకుంటాడు. డెత్ ఓవర్లలో నటరాజన్ పర్ఫామెన్స్, బుమ్రాకి సరైన జోడిగా నిలబెడుతోంది’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.