- Home
- Sports
- Cricket
- వాళ్లు అలా అనేసరికి, సిరాజ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి... ఆస్ట్రేలియా మాజీ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్...
వాళ్లు అలా అనేసరికి, సిరాజ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి... ఆస్ట్రేలియా మాజీ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్...
టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలో 2020-21 ఆస్ట్రేలియా టూర్ విజయం చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఆడిలైడ్ టెస్టులో చిత్తుగా ఓడిన తర్వాత మెల్‌బోర్న్, బ్రిస్బేన్ టెస్టుల్లో గెలిచి 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది భారత జట్టు. ఈ సిరీస్ ద్వారా టెస్టు ఆరంగ్రేటం చేసిన మహ్మద్ సిరాజ్, గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు...

ఆడిలైడ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మహ్మద్ షమీ గాయపడడంతో మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు మహ్మద్ సిరాజ్. రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్ గాయపడి, సిరీస్ మొత్తానికి దూరం కావడంతో మూడో టెస్టులో బుమ్రాతో కలిసి ఓపెనింగ్ స్పెల్ వేశాడు మహ్మద్ సిరాజ్...
సిడ్నీ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, హనుమ విహారి గాయపడి తప్పుకోవడంతో బ్రిస్బేన్‌లో జరిగిన నాలుగో టెస్టులో ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌ని లీడ్ చేసి నడిపించాడు మహ్మద్ సిరాజ్...
సిడ్నీ టెస్టులో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్‌పై కొందరు ఆస్ట్రేలియా జనాలు, జాతివివక్ష వ్యాఖ్యలతో దూషించడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సంఘటనపై సిరాజ్, అంపైర్లకు ఫిర్యాదు చేయడం, పోలీసులు రంగంలోకి దిగి ఆ వ్యాఖ్యలు చేసిన వారిని స్టేడియం నుంచి బయటికి పంపించడం జరిగిపోయాయి...
Mohammed Siraj
‘ఆస్ట్రేలియా పర్యటనకి వచ్చినవారిని మేం అతిథులుగా భావించి, వారిని గౌరవమర్యాదలకు భంగం కలగకుండా చూసుకుంటాం. అయితే సిడ్నీలో సిరాజ్‌కి ఇలాంటి సంఘటన జరగడం మమ్మల్ని బాగా ఇబ్బందిపెట్టింది..
నాకు ఇప్పటికీ గుర్తుంది. సిరాజ్, అంపైర్ దగ్గరకి వచ్చేటప్పుడు అతని కళ్లల్లో నీళ్లు తిరిగి ఉన్నాయి. కన్నీళ్లను తుడుచుకుంటూ వచ్చాడు. అది మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది...
సిరాజ్ తండ్రి కొన్ని రోజుల క్రితమే చనిపోయాడు. ఆ బాధలో ఉన్న వ్యక్తిని ఇలాంటి వ్యాఖ్యలతో దూషించడం మాకు మరింత బాధను కలిగించింది. ఈ సంఘటన తర్వాత మ్యాచ్‌ను రద్దు చేయాలని వాళ్లు డిమాండ్ చేస్తే, మేం దానికి అంగీకరించే వాళ్లం...’ అంటూ కామెంట్ చేశాడు అప్పటి ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ టిమ్ పైన్...