- Home
- Sports
- Cricket
- టీనేజర్స్‌తో క్రికెట్ ఆడించడమంటే ఛైల్డ్ లేబర్‌తో సమానం... మహ్మద్ హఫీజ్ షాకింగ్ కామెంట్స్...
టీనేజర్స్‌తో క్రికెట్ ఆడించడమంటే ఛైల్డ్ లేబర్‌తో సమానం... మహ్మద్ హఫీజ్ షాకింగ్ కామెంట్స్...
సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. టీనేజ్ వయసు నుంచి సత్తా ఉన్న కుర్రాళ్లను గుర్తించి, వారిని సానబెట్టేందుకు వీలుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), పాకిస్తాన్ జూనియర్ లీగ్ తీసుకురావాలనే ఆలోచన చేస్తోంది...

ప్రస్తుతం ఐపీఎల్‌లో అదరగొడుతున్న డేవాల్డ్ బ్రేవిస్, యశస్వి జైస్వాల్, రవి భిష్ణోయ్ కూడా 20 ఏళ్లు కూడా నిండని వాళ్లే. అయితే టీనేజర్స్‌తో క్రికెట్ ఆడించడాన్ని వారితో కూలీ పని చేయించడంతో సమానమంటూ కామెంట్ చేశాడు పాక్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్...
‘జూనియర్ క్రికెట్ లీగ్ ఐడియా గురించి విన్నాను. ఇది క్రికెట్ సిస్టమ్‌ని కచ్ఛితంగా నాశనం చేస్తుంది. ఎందుకంటే 16, 17, 18 ఏళ్ల వయసులో కుర్రాళ్లను టీ20 క్రికెట్ ఆడించడమంటే వారితో కూలీ పని చేయించడంతో సమానం..
ఎందుకంటే వాళ్లు ఇలాంటి పెద్ద స్టేజ్‌ని ఫేస్ చేయడానికి మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండరు. టీనేజ్ వయసులో బేసిక్స్‌పైనే ఎక్కువ ఫోకస్ చేస్తారు...
కాబట్టి సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడితే... వాళ్లు మానసికంగా సిద్ధమవ్వడానికి తగినంత సమయం దొరుకుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్...
అయితే పాకిస్తాన్ జూనియర్ లీగ్‌ని ఈ ఏడాది ప్రారంభించాలని కసరత్తులు చేస్తున్న పాక్ క్రికెట్ బోర్డు, అక్టోబర్ 1 నుంచి 15 వరకూ లాహోర్ వేదికగా ఈ టోర్నీని నిర్వహించాలని భావిస్తోంది..
ఐపీఎల్‌లో పాల్గొనడానికి కూడా 19 ఏళ్లు నిండడం తప్పనిసరి. లిస్టు ఏ మ్యాచులు ఆడిన అనుభవం లేదా 19 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ఐపీఎల్ వేలంలో రిజిస్టర్ చేయించుకోవడానికి అనుమతి ఉంటుంది...
ఈ నిబంధన కారణంగానే అండర్ 19 వరల్డ్ కప్ 2022 ఆడిన అంగ్‌క్రిష్ రఘువంశీ, మానవ్ పరాఖ్, సిద్ధార్థ్ యాదవ్ వంటి ప్లేయర్లు, ఐపీఎల్ 2022 సీజన్ ఆడే అవకాశాన్ని కోల్పోయారు...