కరోనా నుంచి కోలుకున్న మైక్ హుస్సీ... త్వరలోనే ఆస్ట్రేలియాకి పయనం...
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైకేల్ హుస్సీ కరోనా నుంచి కోలుకున్నాడు. సీఎస్‌కే బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి కరోనా పాజిటివ్ రావడంతో క్వారంటైన్‌లోకి వెళ్లిన మైక్ హుస్సీకి రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది.

కరోనా పాజిటివ్‌గా తేలిన రెండు రోజుల్లోనే కోవిద్ నుంచి కోలుకున్నాడు మైకేల్ హుస్సీ. దీంతో అతను ఆదివారం, మిగిలిన ఆస్ట్రేలియా ప్లేయర్లతో కలిసి స్వదేశానికి పయనం కానున్నాడు.

ఐపీఎల్ 2021 సీజన్ కోసం ఇండియాకి వచ్చిన స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్, ప్యాట్ కమ్మిన్స్ వంటి 14 మంది ఆస్ట్రేలియా ప్లేయర్లతో పాటు కోచ్‌లు, సహాయక సిబ్బంది, కామెంటేటర్లు... మాల్దీవుల్లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ఇండియా నుంచే వచ్చే విమానాల రాకపోకలపై ఆస్ట్రేలియా తాత్కాలిక బ్యాన్ విధించడంతో మాల్దీవులకు వెళ్లి, అక్కడ రిలాక్స్ అవుతున్నారు ఆసీస్ క్రికెటర్లు. మైక్ హుస్సీ మాత్రం కరోనా బారిన పడడంతో ఇక్కడే ఉండిపోయాడు.

అతనితో పాటు మాల్దీవుల్లో ఉన్న దాదాపు 40 మంది ఆస్ట్రేలియా ప్లేయర్లు, సిబ్బంది, సహాయక సిబ్బంది కోసం ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేయించింది బీసీసీఐ. వీరంతా ఆదివారం చార్టెడ్ విమానంలో స్వదేశానికి పయనం కానున్నారు.

‘హుస్సీకి కరోనా నెగిటివ్ వచ్చింది. అతను పూర్తిగా కోలుకుంటున్నాడు. త్వరలోనే అతన్ని స్వదేశానికి పంపించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయబోతున్నాం’ అంటూ కామెంట్ చేశాడు సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్. కాశీవిశ్వనాథ్ కూడా కరోనా బారినపడి, కోలుకున్న విషయం తెలిసిందే...

‘నా క్వారంటైన్ సమయం ఇంకా ముగియలేదు. నాకు చేసిన రెండు టెస్టుల్లో ఒకటి నెగిటివ్ రాగా, రెండోది పాజిటివ్ వచ్చింది. నా ఆరోగ్యం చాలా మెరుగైంది.

నా ఆరోగ్యం గురించి చాలామంది తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. దయచేసి విషయం పూర్తిగా తెలుసుకుని, కామెంట్ చేయండి’ అంటూ కామెంట్ చేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా.