ముంబై ఇండియన్స్ విజయోత్సవ ర్యాలీ...సొంత అభిమాానుల మధ్యలో ఆటగాళ్ల సందడి

First Published 14, May 2019, 5:47 PM

హైదరాబాద్ లో జరిగిన ఫైనల్లో చెన్నైపై గెలిచిన ముంబై ఇండియన్స్ 2019 ట్రోఫీతో సొంత నగరానికి చేరుకుంది. అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది. 

ఐపిఎల్ 2019 విజేతగా నిలిచిన ముంబై  ఇండియన్స్ సొంత  నగరానికి చేరుకుంది. రెండు నెలల కష్టానికి ప్రతిఫలంగా అందిన ట్రోఫిని గర్వంగా అభిమానులకు చూపిస్తూ ఆటగాళ్లు సందడి చేశారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు టీం యాజమాన్యం కూడా ముంబై వీధుల్లో సందడి చేశారు.

2019 ఐపిఎల్ ట్రోఫీతో సహా ముంబైకి చేరుకున్న ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది.ముంబై జట్టు సభ్యులందరు  ఓపెన్ టాప్ బస్ ప్రయాణిస్తూ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

ముంంబై ఇండియన్స్ జెండాలను చేతపట్టి ఆటగాళ్లు తెగ సందడి చేశారు. ఆటగాళ్లతో జట్టు యజమాని నీతా అంబానీ కూడా ప్రయాణించడం ఈ విజయోత్సవ ర్యాలీ మొత్తానికే ఆకర్షణగా నిలిచింది. సాధారణ అభిమాని మాదిరిగానే  ఆమె ముంబై జెండాను చేతపట్టి తెగ  సందడి  చేయడం అందరికి ఆకట్టుకుంది.

ఈ వవిజయోత్సవ సంబరాల్లో ముంబై కోచ్ మహేల జయవర్ధనే కూడా పాల్గొన్నారు. ఐపిఎల్ ట్రోఫీని చేతబట్టిన అతడు సగర్వంగా దాన్ని అభిమానులకు చూయిస్తూ అభివాదం చేశాడు.  జట్టుని వెంటుండి నడిపించిన మహేల ఈ సీజన్లు వరుస విజయాలను అందుకోవడంలో తోడ్పాటునందించి... చివరకు టైటిట్ విజేతగా నిలబెట్టాడు.

ఇక ఫైనల్లో చెన్నైని చివరి ఓవర్లో లక్ష్యాన్ని అందుకోకుండా చేసి ముంబై  బౌలర్ లసిత్ మలింగ హీరోగా మారాడు. చివరి ఓవర్లో కేవలం ఏడు పరుగుల మాత్రమే ఇచ్చి జట్టును విజయతీరాలకు చేర్చిన మలింగ ను చూడటానికి అభిమానులు ఎగబడ్డరు. అతడు అభివాదం చేస్తుంటే ముంబై అభిమానుల నుండి విశేశమైన స్పందన వచ్చింది.

కేవలం అభిమానులకే కాదు వాహనంపై వున్న ఆటగాళ్లు సైతం సెల్ఫీలతో సందడి చేశారు. జట్టు సభ్యులంతా కలిసి ట్రోఫీతో తెగ సెల్పీలు దిగారు. అంతేకాకుండా అభిమానులు కనిపించేలా సెల్పీలు దిగుతూ సందడి చేశారు.

ముంబై విజయోత్సవ ర్యాలీలో అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తమ అభిమాన ఆటగాళ్లను  చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముంబై ఇండియన్స్ జెండాలను చేతపట్టి చివరివరకు జోష్ తగ్గకుండా ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు.

loader