విండీస్ క్రికెటర్ శామూల్స్ బూతు పురాణం... బెన్‌స్టోక్స్ నీ భార్యను పంపించమంటూ నీచమైన రాతలు...

First Published 30, Oct 2020, 6:22 PM

క్రికెట్ జెంటిల్మెన్ గేమ్. సభ్యతా, సంస్కారం తెలిసినవాళ్లకి మాత్రమే ఇక్కడ చోటు ఉంటుంది. కానీ కనీస విచక్షణ కూడా లేకుండా క్రికెట్‌లోకి వచ్చి రాణించినవాళ్లూ ఉన్నారు. అయితే బ్యాటు లేదా బంతితో తెచ్చుకున్న పేరు మొత్తం నోటి ద్వారా పొగొట్టుకున్నవాళ్లూ ఉన్నారు. అలాంటివారి జాబితాలో తాజాగా చేరాడు విండీస్ క్రికెటర్ మార్లోన్ శామూల్స్.

39 ఏళ్ల విండీస్ క్రికెటర్ శామ్యూల్స్... తన కెరీర్‌లో 330కి పైగా అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. వన్డే జట్టుకి కెప్టెన్‌గా కూడా వ్యవహారించాడు...

నల్లజాతీయుడైన శామ్యూల్స్‌కి తెల్ల జాతీయులంటే విపరీతమైన ద్వేషం. చాలాసార్లు వారితో మైదానంలోనే తగువుకి దిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.

తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆసీస్, ఇంగ్లాండ్ క్రికెటర్లపై విద్వేషాన్ని ప్రదర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు శామ్యూల్స్. ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్‌స్టోక్స్‌తో పాటు ఆసీస్ క్రికెటర్లపై బూతులతో విరుచుకుపడుతున్నాడు.

ఆగస్టులో జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ టెస్టు సిరీస్ సమయంలో బెన్‌స్టోక్స్ తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో టెస్టు సిరీస్ నుంచి అర్ధాంతరంగా తల్లిదండ్రులు ఉన్న న్యూజిలాండ్‌ బయలుదేరాడు బెన్‌స్టోక్స్.

కరోనా నిబంధనల ప్రకారం 14 రోజులు క్వారంటైన్‌లో గడిపిన తర్వాతే తండ్రిని చూసేందుకు అవకాశం ఇచ్చారు వైద్యులు. ఈ సమయాన్ని వర్ణిస్తూ... ‘ఇదో నరకం... నన్ను అమితంగా ద్వేషించే శామ్యూల్స్‌కి ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నా’ అని వ్యాఖ్యానించాడు బెన్‌స్టోక్స్.

అనవసరంగా తన పేరు తేవడంతో శామ్యూల్స్ తీవ్ర ఆవేశానికి లోనై, అతనిపై బూతులతో విరుచుకుపడ్డాడు. ‘ఈ తెల్లోడు ఇంకా నా గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. నీ భార్యను 14 రోజులు పంపించరా... 14 సెకన్లలో విండీస్ వుమెన్‌గా మారుస్తా’ అంటూ అసభ్యపదజాలంతో ట్వీట్ చేశాడు శామూల్స్.

ఒక క్రికెటర్‌పై మరో క్రికెటర్ ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో ఆసీస్, ఇంగ్లాండ్ క్రికెటర్లు స్పందించారు. వారిని కూడా వదలకుండా తిట్ల దండకం కొనసాగిస్తూనే ఉన్నాడు శామూల్స్.

‘బెన్‌స్టోక్స్ గురించి శామూల్స్ చేసిన పోస్టు చూశాను. శామూల్స్ ఓ సాధారణ ఆటగాడు. అతనికి ఎవ్వరూ సాయం చేయరు. స్నేహితులు కూడా లేరు. తన పాత టీమ్ మేట్స్ కూడా అతన్ని ఇష్టపడరు. బాధపడకు నేను నీకు సాయం చేస్తాను’ అంటూ ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ పోస్టు చేశాడు.

దీంతో మరింత రెచ్చిపోయిన శామూల్స్... షేన్ వార్న్ గురించి పిచ్చిపిచ్చిగా రాతలు రాశాడు.  ‘యంగ్‌గా కనబడాలని ముఖానికి సర్జరీ చేయించుకున్న మొట్టమొదటి క్రికెటర్ నాకు సాయం చేస్తాడట... డాక్టర్ కావాలంటే సర్జరీకి చర్మం కావాలంటే నా స్కిన్ తీసుకోండి... ’ అంటూ అసభ్యపదజాలం వాడాడు.

తనపై శామూల్స్ చేసిన వ్యాఖ్యలను పోస్టు చేసిన షేన్ వార్న్... ‘అతనికి మతి చెడింది... ’ అంటూ పోస్టు చేశాడు. శామూల్స్ అంతటితో ఆగలేదు.

రేషిజం గురించి వ్యాఖ్యానించిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ మైకేల్ వాగన్‌పై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ పోస్టు పెట్టాడు. ‘అతనికి 3 బెడ్ రూమ్ ఫ్లాట్ కావాలంటే లండన్‌లో తన ఫ్లాట్ ఉందంటూ’ పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు రాసుకొచ్చాడు.

‘శామూల్స్ ఇది మరీ భయంకరం. రేషిజం లేకుండా చేయాలని మేం భావిస్తున్నాడు. బెన్‌స్టోక్స్ దీన్ని ఇంతటితో ఆపేయాలని కోరుకుంటున్నా’ అంటూ పోస్టు చేశాడు. దీనికి సమాధానంగా వాగన్‌పై కామెంట్ చేశాడు శామూల్స్.