Ranji Trophy 2024: రంజీలో అదరగొట్టిన మనీష్ పాండే.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 24వ సెంచరీ కొట్టి..
Manish Pandey: రంజీ ట్రోఫీ 2024లో బెంగాల్ తో జరుగుతున్న మ్యాచ్ లో మనీష్ పాండే బ్యాటింగ్ లో రాణించి సెంచరీతో అదరగొట్టాడు. తన 107వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న మనీష్ పాండే 51 కంటే ఎక్కువ సగటుతో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 7,400 పరుగులు సాధించాడు.
Manish Pandey, Ranji Trophy 2024
Ranji Trophy 2024 - Manish Pandey: దేశవాళీ క్రికెట్ లో మనీష్ పాండే తన ధనాధన్ ఇన్నింగ్స్ తో మెరిశాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా కర్నాటక-పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో మనీష్ పాండే సెంచరీ కొట్టాడు.
Manish Pandey
కర్ణాటక వెటరన్ బ్యాటర్ మనీష్ పాండే 2024 రంజీ ట్రోఫీలో 2వ రోజు పంజాబ్‌పై అద్భుతమైన ఆటతో చెలరేగిపోయాడు. 2024లో తన 24వ ఫస్ట్‌క్లాస్ సెంచరీని సాధించాడు. 142 బంతుల్లో తన మైలురాయిని చేరుకున్నాడు. మనీష్ పాండే ఇన్నింగ్స్ లో 11 బౌండరీలు, మూడు సిక్సర్లు బాదాడు.
Manish Pandey
అతని సెంచరీ తర్వాత కర్ణాటక జట్టు స్కోర్ 344/3 గా ఉంది. మనీష్ పాండే ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో ఇప్పటివరకు 107 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లను ఆడాడు. 51 కంటే ఎక్కువ సగటుతో 7,400 పరుగులు చేశాడు.
Manish Pandey
మనీష్ పాండే 2008లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి కర్ణాటక తరపున నిలకడగా రాణిస్తున్నాడు. 24 సెంచరీలతో పాటు, పాండే ఈ ఫార్మాట్‌లో 29 అర్ధ సెంచరీలు కూడా చేశాడు.
Manish Pandey
భారత జాతీయ జట్టు తరఫున కూడా మనీష్ పాండే ఆడాడు. 29 వన్డేలు, 39 టీ20 మ్యాచ్ లో భారత్ తరఫున ఆడాడు. వన్డేలలో 566 పరుగులు, టీ20లలో 709 పరుగులు చేశాడు.
Manish Pandey
ఇక గత 2022-23 రంజీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్ లను ఆడిన మనీష్ పాండే 488 పరుగులు చేశాడు. గోవాపై చేసిన 208* పరుగుతు అత్యధికం. అలాగే, రెండు సెంచరీలు కూడా చేశాడు.
Manish Pandey
ఇదిలావుండగా, కర్నాటక వర్సెస్ పంజాబ్ రంజీ మ్యాచ్ లో 152 పరుగులుకు పంజాబ్ తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయింది. కర్నాటక బౌలర్ వీ కౌశిక్ ఏడు వికెట్లు పడగొట్టాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన కర్నాటక ప్రస్తుతం 448/6 (119.0 ఓవర్లు) పరుగులతో క్రీజులో ఉంది. దేవదత్ పడిక్కల్ 193 పరుగులతో డబుల్ సెంచరీని చేజార్చుకు