ఎవరు గెలిస్తే ఏంటి? క్లైమాక్స్ అదిరిపోద్ది... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీపై కేవిన్ పీటర్సన్...
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ చప్పగా మొదలైంది. మొదటి రెండు వారాల్లో సస్పెన్స్ థ్రిల్లింగ్ మ్యాచ్ ఒక్కటీ లేదు. అయితే రెండు సంచలన విజయాలతో వచ్చే నాలుగు వారాల టోర్నీ మొత్తం ఆసక్తికరంగా మారిపోయింది..
ఇంగ్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం అందుకుంటే, అసోసియేట్ దేశమైన నెదర్లాండ్స్ చేతుల్లో సౌతాఫ్రికా చిత్తుగా ఓడింది. ఈ రెండు సంచలన విజయాలతో పాయింట్ల పట్టిక పూర్తిగా మారిపోయింది..
‘ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్‌ని ఓడించింది. నెదర్లాండ్స్, సౌతాఫ్రికాని ఓడించింది. దీన్ని జనాలు ఎందుకు అంతలా ఆశ్చర్యపోతున్నారు. ప్రతీ మ్యాచ్‌లో ఎవ్వరూ గెలవలేరు. ఈ మ్యాచుల వల్ల క్వాలిఫికేషన్ చాలా క్లిష్టంగా మారుతుంది. కానీ అన్ని టీమ్స్‌కి అవకాశం ఉంటుంది.. మొత్తానికి క్లైమాక్స్ అదిరిపోతుంది! ఎంజాయ్ చేయండి’ అంటూ ట్వీట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్..
Netherlands upset South Africa
మొదటి మ్యాచ్‌లో 428 పరుగులు చేసిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 311 పరుగులు చేసింది. రెండు ఘన విజయాలతో టాప్ నిలిచిన సఫారీ జట్టు, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 ఓవర్లలో 246 పరుగుల టార్గెట్‌ని ఛేదించలేక చతికిల పడింది..
డిఫెండింగ్ ఛాంపియన్‌గా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని ఆరంభించిన ఇంగ్లాండ్, మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది. అయితే ఆ తర్వాత బంగ్లాపై 137 పరుగుల తేడాతో గెలిచినా, ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో 69 పరుగుల తేడాతో పరాజయం పాలైంది..
అదీకాకుండా మోస్ట్ టైం వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ ఆస్ట్రేలియా మొదటి రెండు మ్యాచుల్లోనూ పరాజయాలను ఎదుర్కొంది. శ్రీలంకతో మ్యాచ్ గెలిచేవరకూ 10వ స్థానంలో ఉంది ఆసీస్.. ఈ మూడు జట్లు కూడా వన్డే వరల్డ్ కప్ టైటిల్ ఫెవరెట్లే..
England Cricket Team
క్వాలిఫైయర్స్ గెలిచి వచ్చిన శ్రీలంక మాత్రం ఇప్పటిదాకా ప్రపంచ కప్‌లో బోణీ కొట్టలేదు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో లంక బోణీ కొట్టొచ్చు. ఒకవేళ లంకపై నెదర్లాండ్స్ గెలిచి, మరో సంచలనం సృష్టిస్తే మాత్రం.. మున్ముందు ప్రతీ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా మారుతుంది..
ఇప్పటిదాకా ఏ జట్టు కూడా సెమీ ఫైనల్ రేసు నుంచి తప్పుకోలేదు. శ్రీలంక వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడితే సెమీస్ అవకాశాలు ఆవిరైపోతాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలకు ఇకపై ప్రతీ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్‌గా మారాయి..