మహాకుంభమేళాలో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ .. నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోలు
టీమ్‌ఇండియా క్రికెటర్లు కుంభమేళాకు వెళ్తే ఎలా ఉంటుందో AI సృష్టించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తదితరులు కాషాయ దుస్తుల్లో కుంభమేళాను సందర్శించినట్లుగా చూపిన ఈ చిత్రాలు ది భారత్ ఆర్మీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

క్రికెట్లు మహాకుంభమేళాకు వెళితే.. లేక సాదువులుగా మారిపోతే..ఆ ఊహకు ఏఐ సృష్టించిన రూపమే ఈ ఫొటోలు.
టీమ్‌ఇండియా (Team India) సపోర్టర్ల బృందం ‘ది భారత్ ఆర్మీ’ ఈ ఏఐ సాయంతో క్రికెట్లు కుంభమేళాకు వెళ్తే ఎలా ఉంటారో అనే ఫొటోలను సృష్టించింది. ఈ ఫొటోలు చూస్తే ఎవరికైనా నిజంగానే వాళ్లు కుంభమేళాను సందర్శించారని అనిపిస్తుంది.
జనరేటివ్ ఏఐ సాయంతో సృష్టిస్తోన్న చిత్రాలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఏది నిజమో.. ఏది కృత్రిమమూ అర్థం చేసుకోలేని పరిస్థితి వచ్చేస్తోంది.
ఈక్రమంలోనే క్రికెటర్లు (Cricketers) కుంభమేళాకు వెళ్లినట్లుగా ఉన్న ఫొటోలు నెట్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ‘క్రికెటర్లు మహా కుంభమేళాకు వెళితే’ అనే క్యాప్షన్‌తో ది భారత్ ఆర్మీ వీటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తదితర క్రికెట్లరు కాషాయ దుస్తుల్లో కుంభమేళాను దర్శించుకున్నట్లుగా ఈ ఫొటోలను సృష్టించారు.