MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఎప్పుడు..? హార్ధిక్ ఆన్సర్ అదుర్స్..

టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఎప్పుడు..? హార్ధిక్ ఆన్సర్ అదుర్స్..

Hardik Pandya: రెడ్ బాల్ క్రికెట్ లో హార్ధిక్ ఇప్పటివరకూ.. 11 టెస్టులు ఆడి  18 ఇన్నింగ్స్ లలో 532 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.   2018 తర్వాత  అతడు మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడలేదు. 

2 Min read
Author : Srinivas M
Published : Jan 04 2023, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

2021లో ఫామ్ కోల్పోయి, గాయంతో  జట్టుకు దూరమైన  టీమిండియా ఆల్ రౌండర్, ప్రస్తుతం శ్రీలంకతో సిరీస్ లో   సారథిగా వ్యవహరిస్తున్న  హార్ధిక్ పాండ్యా తిరిగి పునరాగమనంలో అదరగొడుతున్నాడు.  ముఖ్యంగా గతేడాది హార్ధిక్ కెరీర్ లో మరిచిపోలేనిది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Image Credit: PTI

Image Credit: PTI

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ అతడిని పక్కనబెట్టినా  గుజరాత్ టైటాన్స్ కు సారథిగా  వ్యవహరించి ఏకంగా తొలి ప్రయత్నంలోనే కప్ కొట్టాడు.  ఆ తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి అటు బంతితోనూ ఇటు బ్యాట్ తోనూ రఫ్ఫాడిస్తున్నాడు. 

37

టీ20లలో రోహిత్ వారసుడిగా హార్ధిక్ పాండ్యాను నియమించే అవకాశాలే మెండుగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.  అందుకు  కొనసాగింపా అన్నట్టు  వన్డే జట్టులో రోహిత్ కు డిప్యూటీగా అతడి పేరును ప్రకటించింది బీసీసీఐ. ఈ ఏడాది స్వదేశంలో జరుగనున్న వన్డే వరల్డ్ కప్ లో హార్ధిక్ పాండ్యా కీలకంగా వ్యవహరించనున్నాడు.

47

ఇక రెండు ఫార్మాట్లలో అలరిస్తున్న పాండ్యా.. తిరిగి  టెస్టు జట్టులోకి వచ్చేదెపుడు..? అని ఫ్యాన్స్  ఎదురుచూస్తున్నారు. తాజాగా శ్రీలంకతో  తొలి టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత నిర్వహించిన   ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా  అతడికి ఇదే ప్రశ్న ఎదురైంది.  

57

దానికి హార్ధిక్  అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.  హార్ధిక్ స్పందిస్తూ.. ‘నేను మళ్లీ టెస్టు జట్టులోకి ఎప్పుడొస్తాను..? ముందైతే నన్ను ఈ బ్లూ జెర్సీని (పరిమిత ఓవర్ల ఫార్మాట్)  పూర్తిగా ఆస్వాదించనివ్వండి.  ఆ తర్వాత  వైట్ జెర్సీ (టెస్టులు) గురించి ఆలోచిస్తా..’ అని అన్నాడు. రెడ్ బాల్ క్రికెట్ లో హార్ధిక్ ఇప్పటివరకూ.. 11 టెస్టులు ఆడి  18 ఇన్నింగ్స్ లలో 532 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.   2018 తర్వాత  అతడు మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడలేదు. 

67

శ్రీలంకతో   మ్యాచ్ కు ముందు నిర్వహించిన  ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా పాండ్యా   ఈ ఏడాది తాను   భారత్ కు  ప్రపంచకప్ అందించాలని న్యూఈయర్ రెజెల్యూషన్  పెట్టుకున్నానని  వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  
 

77

టీ20 ప్రపంచకప్ తర్వాత  న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టుకు  పొట్టి ఫార్మాట్ లో సారథిగా వ్యవహరించిన హార్ధిక్..  జట్టును ముందుండి నడిపించాడు. భారత్ ఈ సిరీస్ కూడా నెగ్గింది. ఇక తాజాగా శ్రీలంకతో  కూడా తొలి మ్యాచ్ లో భారత్ జయకేతనం ఎగురవేసిన విషయం విదితమే. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved