2003లో వీవీఎస్ లక్ష్మణ్, 2011లో రోహిత్ శర్మ మిస్... అంతకంటే ఘోరంగా ఉన్నా సూర్యకుమార్ యాదవ్‌కి...
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి 15 మందితో కూడిన జట్టుని ప్రకటించింది బీసీసీఐ. ఈ లిస్టులో వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కి చోటు దక్కడంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగతోంది...
2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ముందు టీమిండియాకి మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్. అప్పటికే వన్డేల్లో 27.56 సగటుతో 1240 పరుగులు చేశాడు వీవీఎస్ లక్ష్మణ్. అయితే లక్ష్మణ్‌ని పక్కనబెట్టి దినేశ్ మోంగియాని వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేసింది భారత జట్టు..
134 టెస్టులు ఆడిన వీవీఎస్ లక్ష్మణ్, తన 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 86 వన్డేలు ఆడినా ఒక్క వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు...
2023 వన్డే వరల్డ్ కప్‌కి కెప్టెన్సీ చేయబోతున్న రోహిత్ శర్మ, 2011 వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 2011 ప్రపంచ కప్‌కి ముందే వన్డేల్లో 28.35 సగటుతో 1219 పరుగులు చేశాడు రోహిత్ శర్మ..
2023 వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్, ఇప్పటిదాకా 23 వన్డేలు ఆడి 24.05 సగటుతో 433 పరుగులు మాత్రమే చేశాడు. వన్డేల్లో సూర్య స్ట్రైయిక్ రేటు కూడా 100కి తక్కువగానే ఉంది..
2003 వన్డే వరల్డ్ కప్‌కి ముందు వీవీఎస్ లక్ష్మణ్ (27.56), 2011 వన్డే వరల్డ్ కప్‌కి ముందు రోహిత్ శర్మ సగటు (28.35) కంటే సూర్యకుమార్ యాదవ్ వన్డే సగటు తక్కువైనా.. అతనికి 2023 ప్రపంచ కప్‌లో చోటు దక్కింది..
కేవలం ముంబై ఇండియన్స్ ప్లేయర్ కావడం వల్లే సూర్యకి వన్డే వరల్డ్ కప్ ఆడే అదృష్టం దక్కిందని కొందరు అంటుంటే, టీ20ల్లో నెం.1 బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో సెటిల్ అయితే ఈజీగా సెంచరీలు చేయగలడని మరికొందరు అంటున్నారు..
Suryakumar Yadav
చూస్తుంటే వన్డే వరల్డ్ కప్ 2023 ముగిసేవరకూ సూర్యకుమార్ యాదవ్ ఎంపిక గురించి చర్చ జరుగుతూనే ఉండేలా ఉంది. ఒకవేళ రిజల్ట్ తేడా కొడితే, సంజూ శాంసన్‌ని కాదని సూర్యని వన్డే వరల్డ్ కప్‌కి ఎంపిక చేసినందుకు సెలక్టర్లు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది..