టీ20 వరల్డ్‌కప్ ముందు ఫైనల్ మ్యాచ్... ఈ ప్లేయర్లకు కీలకంగా మారిన ఆఖరి టీ20...
టీ20 వరల్డ్‌కప్‌కి ముందు శ్రీలంకతో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఇప్పటికే చెరో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఈ మ్యాచ్ సిరీస్ విజేతని నిర్ణయించడానికి ఫైనల్ మ్యాచ్ కానుంది. ముఖ్యంగా కొందరు భారత క్రికెటర్ల భవితవ్యాన్ని ఈ ఫైనల్ టీ20 నిర్ణయించనుంది...

శిఖర్ ధావన్: శ్రీలంక టూర్‌లో కెప్టెన్‌గా కొత్త అవతారం ఎత్తాడు శిఖర్ ధావన్. కెప్టెన్‌గా ఆడిన తొలి వన్డేలో 86 పరుగులు చేసిన గబ్బర్, ఆ తర్వాత ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు.

రెండో వన్డేలో 29 పరుగులు, మూడో వన్డేలో 13 పరుగులు చేసి నిరాశపరిచిన శిఖర్ ధావన్... మొదటి టీ20 మ్యాచ్‌లో 36 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేశాడు. రెండో టీ20 మ్యాచ్‌లో 42 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేశాడు...

కరోనా ప్రోటోకాల్ కారణంగా స్టార్ బ్యాట్స్‌మెన్లను కోల్పోయిన భారత జట్టును నడిపించే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్న శిఖర్ ధావన్, రెండో టీ20లో టాప్ స్కోరర్‌గా నిలిచినా... అతను ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ విశ్లేషకులను పెద్దగా మెప్పించలేకపోయింది....

ఇప్పటికే టీ20 ఓపెనర్‌గా కెఎల్ రాహుల్ నుంచి విపరీతమైన పోటీ ఎదుర్కొంటున్న శిఖర్ ధావన్, టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే... నేటి మ్యాచ్‌లో ఓ సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించకపోయినా, సెలక్టర్లను ఇంప్రెస్ చేయగల ఓ భారీ ఇన్నింగ్స్ మాత్రం ధావన్ నుంచి రావాల్సిందే...

భువనేశ్వర్ కుమార్: టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నవారిలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా ఉన్నాడు. మొదటి వన్డేలో భారీగా పరుగులిచ్చిన భువీ, రెండో వన్డేలో మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

మొదటి టీ20 మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న భువీ, రెండో టీ20లో మొదటి మూడు ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి, ఓ వికెట్ తీశాడు. అయితే డెత్ ఓవర్ స్పెషలిస్టు అయిన భువీ, 19వ ఓవర్‌లో ఓ ఫుల్ టాస్ బంతి వేసి సిక్సర్ సమర్పించాడు.

భువీ ఇచ్చిన ఈ సిక్సర్, మ్యాచ్ ఫలితాన్ని మొత్తం మార్చి వేసింది. దీపక్ చాహార్ రెండో వన్డేలో ఆల్‌రౌండర్‌గా నిరూపించుకుని, రేసులో నిలిచాడు. దీంతో టీ20 వరల్డ్‌కప్‌లో భువనేశ్వర్ కుమార్‌కి చోటు దక్కాలంటే, నేటి మ్యాచ్‌లో అతను మ్యాజిక్ చేసి చూపించాల్సిందే.

కుల్దీప్ యాదవ్: భారత జట్టుకి ఎన్నో అద్భుత విజయాలు అందించిన చైనామెన్ స్పిన్నర్, ఈ మధ్య కొంతకాలంగా కష్టకాలం ఎదుర్కొంటున్నాడు. జట్టుకి ఎంపికవుతున్నా, తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న కుల్దీప్ యాదవ్, చాలాకాలం తర్వాత ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్ ఆడినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

మొదటి వన్డేలో 9 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 2 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, రెండో వన్డేలో వికెట్లేమీ తీయలేకపోయాడు. రెండో టీ20లో చోటు దక్కించుకున్న కుల్దీప్ యాదవ్, 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపికకావాలంటే కుల్దీప్ యాదవ్ నుంచి ఈరోజు మ్యాచ్‌లో కూడా అలాంటి పర్ఫామెన్స్ రావాలి. ఇప్పటికే యజ్వేంద్ర చాహాల్ ఫామ్‌ను అందుకుని, రేసులో నిలవడంతో కుల్దీప్ యాదవ్ కూడా తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.