- Home
- Sports
- Cricket
- మొదటి మ్యాచ్‌లో రికార్డు డబుల్ సెంచరీ... ఒంటిచేత్తో విండీస్‌ను గెలిపించిన కేల్ మేయర్స్...
మొదటి మ్యాచ్‌లో రికార్డు డబుల్ సెంచరీ... ఒంటిచేత్తో విండీస్‌ను గెలిపించిన కేల్ మేయర్స్...
విండీస్‌కి 395 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చి, తేలిగ్గా గెలిచేయొచ్చని ఆశపడిన బంగ్లాదేశ్‌కి ఓ ఆరంగ్రేటం ఆటగాడు అదిరిపోయే షాక్ ఇచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చిన కేల్ మేయర్స్... నాలుగో ఇన్నింగ్స్‌లో అజేయ డబుల్ సెంచరీ బాది, విండీస్‌కి ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు.

మొదటి ఇన్నింగ్స్‌లో 430 పరుగుల భారీ స్కోరు చేసిన బంగ్లాదేశ్, విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకే ఆలౌట్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 223 పరుగులకి 8 వికెట్లు కోల్పోయిన దశలో 395 భారీ టార్గెట్‌ను విండీస్ ముందు ఉంచి, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది బంగ్లాదేశ్.

నాలుగో ఇన్నింగ్స్‌లో 59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన విండీస్‌ను కేల్ మేయర్స్‌ను అద్భుతంగా ఆదుకున్నాడు. బోనర్‌తో కలిసి 216 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన మేయర్స్, జసుమా డ సిల్వాతో కలిసి 100 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. మొత్తం 310 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో 210 పరుగులు చేసిన కేల్ మేయర్స్... బంగ్లాకి చుక్కలు చూపించి, విండీస్‌కి విజయాన్ని అందించాడు.

మొట్టమొదటి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ బాదిన ఆరో ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన మేయర్స్... ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. మొదటి టెస్టులో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదుచేసిన ప్లేయర్‌గా నిలిచాడు మేయర్స్...

భారీ టార్గెట్ చేధనలో డబుల్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పిన మేయర్స్... ప్రత్యర్థి జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తర్వాత పర్యాటక జట్టు విజయం సాధించడం ఇది మూడోసారి. ఇంతకుముందు రెండుసార్లు ఇంగ్లాండ్‌ను ఇలా ఓడించిన విండీస్, నాలుగేళ్ల తర్వాత బంగ్లాదేశ్‌ను ఓడించింది.

మొట్టమొదటి మ్యాచ్ ఆడుతూ సెంచరీతో విజయాన్ని అందించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు కేల్ మేయర్స్. ఇంతకముందు 2003లో పాక్ ప్లేయర్ యాసిర్ హమీద్... ఆరంగ్రేటం మ్యాచ్‌లో 105 పరుగులు చేసి పాక్‌ని గెలిపించగా... 2021లో కేల్ మేయర్స్ 210 పరుగులతో విండీస్‌కి అఖండ విజయం అందించాడు.

144 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో మొదటి మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్లు ఐదుగురు కాగా, నాలుగో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్లు కూడా ఐదుగురు. కానీ మొట్టమొదటిసారి ఆరంగ్రేటం మ్యాచ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ బాది, విజయాన్ని అందించిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు మేయర్స్...