జడ్డూ లేడు, ఈసారైనా కుల్దీప్ యాదవ్‌కి ఛాన్స్ దక్కుతుందా.... లేక మళ్లీ...
ఆడిన ఆఖరి టెస్టులో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చినా, టీమ్‌కి దూరమయ్యాడు కుల్దీప్ యాదవ్. ఆస్ట్రేలియాలో గత పర్యటనలో అద్భుతంగా రాణించిన కుల్దీప్ యాదవ్, ఆఖరి మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు. హెడ్ కోచ్ రవిశాస్త్రిని, తన బౌలింగ్ పర్ఫామెన్స్‌తో మెప్పించాడు. విదేశాల్లో టెస్టు సిరీస్ ఆడితే మొదటి ప్రాధాన్యం కుల్దీప్ యాదవ్‌కే దక్కుతుందని మాటిచ్చాడు రవిశాస్త్రి.

అయితే గత ఐపీఎల్ సీజన్‌లో పెద్దగా మ్యాచులు ఆడలేదు కుల్దీప్ యాదవ్. అతనికి ఒకే ఒక్క మ్యాచ్‌లో అవకాశం ఇచ్చిన కేకేఆర్, పూర్తిగా 4 ఓవర్ల కోటా కూడా బౌలింగ్ ఇవ్వలేదు.

ఆస్ట్రేలియా టూర్‌లో మొదటి టెస్టులో జడేజా లేకపోయినా, ఆఖరి టెస్టులో గాయంతో అతను ఆడలేకపోయినా కుల్దీప్ యాదవ్‌వైపు చూడలేదు టీమిండియా...

విదేశాల్లో మొదటి ప్రాధాన్యం కుల్దీప్ యాదవ్‌కే ఉంటుందని మాటిచ్చిన కోచ్ రవిశాస్త్రి... మూడో ఆప్షన్‌గా కూడా అతన్ని వినియోగించుకోకపోవడం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది...

వికెట్లు తీయకపోతే, భారీగా పరుగులు ఇస్తుంటే... జట్టుకి దూరం కావడం సహాజం. కానీ అద్భుతంగా రాణిస్తుంటే జట్టులో చోటు కోసం వేచి చూడాల్సి రావడం బహుశా టీమిండియాలో మాత్రమే జరుగుతుందేమో...

నాలుగో టెస్టులో స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ మొట్టమొదటి మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశాడు... బ్యాటుతోనూ రాణించి, ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు...

ఆస్ట్రేలియా టూర్ ముగిసిన తర్వాత గబ్బా డ్రెస్సింగ్ రూమ్‌లో కుల్దీప్ యాదవ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు కెప్టెన్ అజింకా రహానే. స్వదేశంలో జరిగే తర్వాతి సిరీస్‌లో తప్పకుండా అవకాశం వస్తుందని హామీ ఇచ్చాడు...

అయితే రహానే ఆలోచనా విధానం వేరు, విరాట్ కోహ్లీ ఆలోచనా విధానం వేరు... రహానే ఇచ్చిన మాటకి కట్టుబడి, కుల్దీప్ యాదవ్‌ని తుదిజట్టులోకి తీసుకోవడానికి కోహ్లీ ఒప్పుకుంటాడా? అనేది అనుమానమే.

ఆస్ట్రేలియా పర్యటనలో రవీంద్ర జడేజాను ఆల్‌రౌండర్‌గా ఉపయోగించుకుంది భారత జట్టు. మొదటి టెస్టులో, ఆఖరి టెస్టులో ఒకే స్పిన్నర్‌తో బరిలో దిగింది...

ఇంగ్లాండ్ సిరీస్‌లో కూడా ఇదే వ్యూహ్యాన్ని అమలు చేసే అవకాశం ఉంది. అలా చూస్తే ఇషాంత్, బుమ్రా, సిరాజ్ వంటి ముగ్గురు పేసర్లతో పాటు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది...

శ్రీలంక పర్యటనలో స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడానికి ఇంగ్లాండ్ ఇబ్బంది పడింది. దాన్ని పరిగణనలోకి తీసుకుంటే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లలో ఒకరికి ఛాన్స్ దక్కడం పక్కా....

ఎలా చూసుకున్నా... రెండు హ్యాట్రిక్‌లు సాధించిన కుల్దీప్ యాదవ్, జట్టులో చోటు దక్కించుకునేందుకు ఒకే ఒక్క టెస్టు ఆడిన వాషింగ్టన్ సుందర్‌తో పోటీపడాల్సి ఉంటుంది...